స‌న్నీ గ్యాంగ్‌తో సిరి మాట్లాడ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయిన ష‌ణ్ముఖ్‌..!

December 7, 2021 9:17 AM

బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రో రెండు వారాల‌లో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో కేవ‌లం ఆరుగురు మాత్ర‌మే ఉన్నారు. సోమ‌వారం ఎపిసోడ్‌లో ముందు రోజు జ‌రిగిన విష‌యాల‌పై ముచ్చ‌టించుకున్నారు. మానస్‌, కాజల్‌.. సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్‌ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్‌ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

shanmukh not ok with siri talking to sunny and gang

నువ్వు జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే నీ క్యారెక్ట‌ర్ బ్యాడ్ అవుతుంది. నువ్వు నేను ప‌డుకున్న‌ప్పుడు ఒక‌లా, లేచిన‌ప్పుడు ఒక‌లా ఉంటావు. అయిన నా ద‌గ్గ‌ర ఉండ‌కు అని చిరాకుగా చెప్పాడు ష‌ణ్ముఖ్‌. దీంతో సిరి ఏడ్చేసింది. అనంత‌రం అత‌నికి సారీ చెప్పింది. సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్‌ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్‌ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు.

అనంతరం బిగ్‌బాస్‌ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు ప‌లు అభిప్రాయాలు చెప్పుకున్నాక చివ‌ర‌కు సన్నీ 1, షణ్ను 2, కాజల్‌ 3, శ్రీరామ్‌ 4, మానస్‌ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్‌ శ్రీరామ్‌ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్‌ అయ్యారని ప్రకటించాడు.

ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్‌. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. ఈ క్ర‌మంలో షణ్ను-కాజల్‌ మధ్య మరోసారి ఫైట్‌ నడిచింది. దీంతో కాజల్‌ చాలా యాటిట్యూడ్‌ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్‌ కాన్ఫిడెన్స్ అయి ఉంటుంది అని సిరి చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్‌ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment