Samantha: స‌మంత‌పై పురుషుల ఆగ్ర‌హం, మ‌హిళ‌లు పాలాభిషేకం

December 17, 2021 11:37 AM

Samantha : అల్లు అర్జున్ – ర‌ష్మిక మందన్న ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం పుష్ప‌. ఈ సినిమా రేపు విడుద‌ల కానుండ‌గా, జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటమ్‌ సాంగ్ మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఊ అంటావా మావా.. ఉహు ఉహు అంటావా మావ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది.

men angry on Samantha women pours milk

ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళా మండలి వారు మద్దతు తెలుపడం వైరల్ గా మారింది. మగవాళ్ల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండడంతో వారు నొచ్చుకోగా మహిళలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట. ఈ ఘటన అమరావతిలో చోటు చేసుకుంది. అక్కడి మహిళా మండలి వారు ఈ సాంగ్ చేసిన సమంతకి అలాగే, పాట రాసిన చంద్రబోస్ కి పాలాభిషేకం చేశారట.

అక్కడితో ఆగకుండా సినిమా రిలీజ్ కి చూస్తామని ఈ పాటకి విజిల్స్ కూడా వేస్తామని తెలిపారట. ఇప్పుడు ఈ మెసేజ్  సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల విడుదలైన ఈ పాట ఓ యూట్యూబ్‏ని షేర్ చేస్తుంది. సింగర్ మంగ్లీ చెల్లెలు, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‏తో పాడిన ఈ పాట జనాన్ని తెగ ఆకట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now