Samantha : విడాకుల విష‌యంపై తొలిసారి స్పందించిన స‌మంత‌..!

December 6, 2021 10:17 PM

Samantha : టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ చైతన్య‌ – స‌మంత అక్టోబ‌ర్ 2న త‌మ విడాకుల విష‌యాన్ని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అక్టోబర్ 6న వీరి 4వ వివాహ వార్షికోత్సవ వేడుక జ‌రుపుకుంటార‌ని అంద‌రూ భావిస్తున్న నేప‌థ్యంలో ఇకపై ఈమె అక్కినేని కోడలు కాదనే విషయం చైత‌న్య‌తోపాటు నాగ్ కూడా ప్ర‌క‌టించారు. దయచేసి తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని.. కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు, శ్రేయోభిలాషులు తమ నిర్ణయంపై ప్రైవసీ పాటించాల‌ని కోరింది.

Samantha responded for the first time on divorce with naga chaitanya

అక్కినేని నాగ చైతన్యతో డైవోర్స్ అనంతరం సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. అమ్మ చెప్పిందంటూ ప‌లు విష‌యాల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తుంది. అయితే డైవోర్స్ విషయంలో అదే సోషల్ మీడియాలో నెటిజన్లు సమంతదే తప్పు అన్నట్టుగా విపరీతమైన ట్రోల్స్ చేశారు. కానీ ఇన్నాళ్లూ వాటిపై స్పందించ‌లేదు. త‌న‌ప‌ని తాను చేసుకుంటూ ముందుకు సాగింది.

తాజాగా ఓ ప్రఖ్యాత మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి.. త‌న‌పై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించింది. విడాకులపై ముందుగా తన మాటలతో అందరూ అంగీకరిస్తారని అనుకోవడం లేదని చెప్పేసిన సమంత.. అందరూ తన కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలని డిమాండ్ చేయనని.. ఎవరికి వారికి వారి అభిప్రాయాలు ఉండకూడదని కూడా తాను అనుకోనని.. కానీ మనం చేసే పని ఆమోదయోగ్యంగా ఉండాలని గుర్తు పెట్టుకోవాలని చెప్పింది. అసలు విడాకుల వెనుక కారణాలను మాత్రం వెల్లడించేందుకు సమంత ఇష్టపడలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now