Samantha : అల్లు అర్జున్‌తో అంత క‌ష్ట‌మా..?

December 9, 2021 2:48 PM

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న స‌మంత ప‌లువురు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందింది. గ‌తంలో బన్నీ స‌ర‌స‌న ప‌లు సినిమాలు చేసిన సామ్ తొలిసారి ఆయ‌న‌తో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ చేసింది. పుష్ప ఐటెం సాంగ్ కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన బాణీలు రూపొందించ‌గా, అల్లు అర్జున్, స‌మంత అదిరిపోయే స్టెప్పులు వేశారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గ‌ణేష్ ఆచార్య కొరియోగ్ర‌ఫీలో ఈ సాంగ్ పూర్తైన‌ట్టు తెలుస్తోంది.

Samantha opened up about allu arjun and his dance

తాజాగా స‌మంత పాట‌కు సంబంధించిన షూట్ పూర్తి కావ‌డంతో, త‌న అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చింది. బ‌న్నీతో డ్యాన్స్ చేయ‌డం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింద‌ని పేర్కొంది. ఆ రిథ‌మ్, స్పీడ్ బాబోయ్.. పెద్ద ఛాలెంజింగ్‌గా ఉందని స‌మంత పేర్కొంది. అయితే ఈ సాంగ్‌ పుష్ప సినిమాకు ఒక ఐకానిక్ మూమెంట్ అవుతుందట. ఇక సమంత, బన్నీ వేసే స్టెప్పులు కూడా మామూలుగా ఉండవని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఈ స్పెషల్ సాంగ్ మీద ఇటు బన్నీ, అటు సుకుమార్.. ఇంకోవైపు దేవీ శ్రీ ప్రసాద్ మంచి కసితో ప‌నిచేసిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

సామ్‌ స్పెషల్‌ సాంగ్‌కు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 10న ఈ సాంగ్‌ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో లంగా, జాకెట్‌ ధరించి, మాస్‌ లుక్‌తో కనిపిస్తున్న సమంత ఫోటోను విడుదల చేసిన పుష్ప టీం తాజాగా మరొక కొత్త లుక్‌ను రిలీజ్‌ చేసింది. ‘చలికాలంలో హీట్‌ పెంచే పాట ఇది.. సిజలింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ ఈ సందర్భంగా ట్వీట్‌ చేసింది చిత్రబృందం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now