RRR : దారుణం.. ప‌వన్ రికార్డ్ బ్రేక్ చేయ‌లేక‌పోయిన ఆర్ఆర్ఆర్..

December 9, 2021 4:22 PM

RRR : రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి ఇద్ద‌రు టాప్ హీరోల‌తో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్లల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు.  జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ ను కొద్దిసేప‌టి క్రితం విడుద‌ల చేయ‌గా, ఇది సినీ ప్రేక్ష‌కుల మ‌తులు పోగొడుతోంది. రాజ‌మౌళి ఈ సినిమాతోనూ తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేయ‌నున్నాడని అంటున్నారు.

RRR movie trailer did not break pawan kalyan record

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ భారీ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ట్రైలర్‌కు తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్, లైకులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది. దీంతో చాలా సినిమాల రికార్డులు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ, ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పవన్ నటించిన వకీల్ సాబ్‌ను మాత్రం దాటలేకపోయింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ చిత్ర ట్రైల‌ర్ ఏడు నిమిషాల్లోనే 100K లైకులు సొంతం చేసుకోగా.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ మాత్రం ఎనిమిది నిమిషాల్లో ఈ మార్కును చేరుకుంది. దీంతో ఈ రికార్డు పవన్ పేరిటే ఉండిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ 100K లైకుల రికార్డును బ్రేక్ చేయలేకపోయింది కానీ.. 200k లైకులను 18 నిమిషాల్లో.. 300K లైకులను 32 నిమిషాల్లో.. 400K లైకులను 52 నిమిషాల్లో.. 500K లైకులను ఒక గంట ఇరవై నిమిషాల్లో సొంతం చేసుకుంది. 100K మినహా అన్నింట్లోనూ హవా చూపించి రికార్డు క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now