RRR Movie : వార్నీ.. ఇంకా సినిమానే విడుద‌ల కాలేదు.. అప్పుడే ఓటీటీనా..!

December 9, 2021 9:33 PM

RRR Movie : క‌రోనా నేప‌థ్యంలో అటు హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ మొద‌లుకొని కింది వ‌ర‌కు అన్ని భాష‌ల‌కు చెందిన సినీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు త‌మ మూవీల‌ను చాలా వ‌ర‌కు ఓటీటీల్లోనే విడుద‌ల చేశారు. ఈ మ‌ధ్య కాలంలో క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ఆంక్ష‌ల‌ను స‌డ‌లించారు క‌నుక య‌థావిధిగా థియేట‌ర్ల‌లో సినిమాల‌ను రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

RRR Movie on OTT makers confirmed when it will be available

ఇక తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా సినిమాలు ఇప్ప‌టికే ఓటీటీలో సంద‌డి చేశాయి. థియేట‌ర్ల‌లో ఒక‌వేళ రిలీజ్ అయినా 35-40 రోజుల త‌రువాత ఓటీటీల్లో రిలీజ్ చేసుకునేలా ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో సినిమా థియేట‌ర్ల‌లో వ‌చ్చిన కొద్ది రోజుల‌కు ఓటీటీకి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో చాలా మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం ఎందుక‌ని ఓటీటీల్లో సినిమాల‌ను చూసేందుకే అల‌వాటు ప‌డ్డారు.

అయితే ముందు ముందు ఈ ప‌రిస్థితి ఉండ‌క‌పోయినా.. ప్రేక్ష‌కులు మాత్రం ఓటీటీల‌కు బాగానే అల‌వాటు ప‌డ్డార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే వారు కొత్త సినిమా ఏది వ‌చ్చినా స‌రే ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుంది ? అంటూ తెలుసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కూడా ఈ చ‌ర్చ న‌డుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన ట్రైల‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఈ ట్రైల‌ర్ ఇప్ప‌టికే యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీని జ‌న‌వ‌రి 7వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ముంబైలో ప్రెస్ మీట్ నిర్వ‌హించింది. అందులో భాగంగా విలేక‌రులు ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుంది ? అని అడిగారు. దీంతో షాకైన చిత్ర యూనిట్ త‌రువాత ఓపిగ్గానే స‌మాధానం ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ మూవీని ఎక్కువ రోజుల పాటు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో చూడాల‌ని కోరుకుంటున్నామ‌ని ఆ చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఓటీటీల్లో 90 రోజుల త‌రువాతే విడుద‌ల చేస్తామ‌ని నిర్మొహ‌మాటంగా చెప్పేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే.. ఏప్రిల్ 2022లో ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీల్లోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now