RGV Vyooham : వ్యూహం రిలీజ్ గురించి చెబుతూ వారికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన వ‌ర్మ‌

December 15, 2023 11:09 AM

RGV Vyooham : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌ప్పుడు అద్భుత‌మైన సినిమాలు తీసి ప్రేక్షకుల‌కి మంచి వినోదాన్ని పంచాడు. కాని ఇటీవ‌లి కాలంలో మాత్రం కాంట్రవ‌ర్సీ చిత్రాలు తీస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే గ‌త కొంతకాలంగా వ‌ర్మ జ‌గ‌న్‌కి అనుకూలంగా సినిమాలు చేస్తున్నాడు. వైసీపీ అధినేత సీఎం జగన్ రాజకీయ జీవిత ఆధారంగా రాంగోపాల్ వర్మ వ్యూహం, శపథం.సినిమాలు ప్రకటించడం తెలిసిందే. అయితే రామదూత క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాలలో మొదటి భాగం “వ్యూహం” నవంబర్ నెలలోనే విడుదల కావాల్సింది.కానీ ఆ సమయంలో సెన్సార్ పూర్తి కాలేదు.

అయితే తాజాగా “వ్యూహం” సినిమాకి సెన్సార్ పూర్తయినట్లు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ కూడా చూపిస్తూ..డిసెంబర్ 29వ తారీకు “వ్యూహం” విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ తనదైన శైలిలో పోస్టు పెట్టారు. చిత్రంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైయస్ జగన్ జీవితంలో రాజకీయంగా చోటు చేసుకున్న సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.రెండు భాగాలుగా రాంగోపాల్ వర్మ ఈ సినిమాని చేయ‌డం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ప్రకటనతో జగన్ అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు కృషి అవుతున్నారు.

RGV Vyooham he is not happy with the film certificate
RGV Vyooham

వ్యూహం చిత్రంలో వైఎస్ఆర్ మరణం అనంతరం పరిస్థితులు ఉలా ఏర్ప‌డ్డాయి, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? జగన్ ఏపీ సీఎం ఎలా అయ్యారు? అనే కథాంశాలను చూపించ‌బోతున్నాడు. తండ్రి మరణం తర్వాత తనకు ఎదురైన గడ్డు పరిస్థితులను సీఎం జగన్‌ అధిగమించిన తీరు, ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానాన్ని శపథం సినిమాలో వర్మ ఆవిష్కరించనున్నట్లు సమాచారం. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్‌ నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now