Rashmi Gautam : రష్మీ పుట్టింది తెలుగు రాష్ట్రంలోనైనా రష్మీకి ఎందుకు తెలుగు మాట్లాడటం రాదో తెలుసా..?

November 16, 2022 3:40 PM

Rashmi Gautam : బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షోల ద్వారా బోలెడు క్రేజ్‌ సంపాదించుకుంది రష్మీ గౌతమ్. గతంలో జబర్దస్త్ షోను అనసూయ హోస్ట్‌ చేస్తుండగా, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కి రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీ కావడంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల అనసూయ జబర్దస్త్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రెండు షోలకు రష్మీనే యాంకర్‌గా చేస్తూ వస్తోంది.

రష్మీ  కెరియర్ బిగినింగ్ లో  సినిమాల్లో నటించింది. ఆమె చదువు పూర్తి కాగానే సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చేసింది. సినిమా అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేయగా 2011 లో ఒక తమిళ రొమాంటిక్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. టాలీవుడ్ లోకి  ప్రస్థానం సినిమాలో రష్మీ సపోర్టింగ్ రోల్ లో  ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హోలీ, థాంక్స్, కరెంట్, బిందాస్, గురు వంటి సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో చేసింది.

Rashmi Gautam born in telugu state but she do not know telugu why
Rashmi Gautam

ఆ తర్వాత బుల్లితెరకు వచ్చేసింది. రష్మీ జబర్దస్త్ కార్యక్రమంతో పాపులర్ అయ్యాక ఆమెకు హీరోయిన్ గా చేసే ఛాన్స్ మరోసారి తలుపు తట్టింది. గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్ గా అందాలు ఆరబోసి టాలీవుడ్ ని షేక్ చేసింది. ఈ మధ్యనే విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంలో కూడా రష్మీ హీరో నందుతో కలిసి నటించిన ప్రేక్షకులను మెప్పించింది.

ఇక రష్మీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే  1982 ఏప్రిల్ 27 న విశాఖపట్నంలో జన్మించింది. పుట్టింది ఆంధ్రాలోనే అయినా నిజానికి రష్మీ  ఒడిశా రాష్ట్రనికి చెందిన అమ్మాయి.  రష్మీ తండ్రి ఉద్యోగ రీత్యా వైజాగ్ లో ఉండుట వలన రష్మీ కూడా వైజాగ్ లోని డిగ్రీ వరకు చదివింది. రష్మీ ఒడిసి బాష బాగా వచ్చు. అయితే తెలుగు మాత్రం పూర్తి స్థాయిలో రాదు. అందుకే రష్మీ జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాలలో తెలుగులో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment