Ram Charan Tej : మ‌ర‌ద‌లితో స్టెప్పులేసి ర‌చ్చ చేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

December 9, 2021 8:11 PM

Ram Charan Tej : ఉపాసన సోదరి అనుష్పల పెళ్లి సందడి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అందుకు కార‌ణం ఆమె రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌దలు కావ‌డ‌మే. మెహందీ వేడుక నుండి పెళ్లి వ‌ర‌కు ఉపాస‌న అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ ఫోటోగ్రఫీ నుంచి అద్భుతమైన స్టిల్స్ వైరల్ అయ్యాయి. ఈ పెళ్లిలో రామ్ చరణ్ – ఉపాసన ఎంతో సందడిగా కనిపించారు.

Ram Charan Tej danced in his sister in law marriage

ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రీ తన భార్య ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ టాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్‌ మరదలితో కలిసి డ్యాన్స్‌ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. మ‌ర‌ద‌లితో చెర్రీ స‌ర‌దాగా డ్యాన్స్ చేయ‌డం ప‌ట్ల నెటిజ‌న్స్ భిన్న‌మైన కామెంట్స్ పెడుతున్నారు.

ఈ వివాహానికి సెలబ్రిటీ అతిథుల జాబితా పెద్దదే ఉంది. బడ్జెట్ కూడా పెద్ద రేంజ్‌ లోనే ఖర్చయిందని తెలిసింది. ఇక అటు బాలీవుడ్ అందాల కథానాయిక కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇది పూర్తి సెక్యూరిటీ నడుమ ఎలాంటి ఫోటో లీక్ లేకుండా జరుగుతోంది. ఈ పెళ్లి వేడుక విజువల్స్ కి సంబంధించిన హక్కులను రూ.100 కోట్లకు ఓటీటీకి అమ్మేశారన్న గుసగుస వినిపిస్తోంది.

https://www.instagram.com/p/CXOwfpMqa2J/?utm_source=ig_embed&ig_rid=9e077ae5-274f-4901-94ca-8238874dc9b6

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now