Ram Charan : కూతురితో రామ్ చ‌ర‌ణ్ సంద‌డి.. క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ అదుర్స్..

December 27, 2023 3:53 PM

Ram Charan : క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ దేశమంత‌టా ఘ‌నంగా జ‌రిగాయి.సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీస్ కూడా ఈ పండ‌గని ఎంతో సంతోషంగా జ‌రుపుకున్నారు.మెగా, అల్లు ఫ్యామిలీ కూడా క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహారెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చరణ్, ఉపాసనల ముద్దుల తనయ క్లీంకారతో పాటు లావ‌ణ్య త్రిపాఠి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ కూతురుతో దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘బెస్ట్ డాడ్’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

రామ్ చరణ్, ఉపాసన పాపతో వున్న ఫోటోస్ కాకుండా, అల్లు అర్జున్, స్నేహ దంపతులతో వున్న ఫోటోస్ కూడా షేర్ చేశారు. అలాగే మెగా కుటుంబానికి సంబదించిన అందరితో క్రిస్మస్ పండగ ఎంత బాగా చేసుకున్నారు అన్న విషయం కూడా చెప్పడానికి అందరితో ఒక ఫోటో షేర్ చేశారు. స్నేహితురాలు అయిన నమ్రత శిరోద్కర్ తో కూడా వున్న ఫోటోని షేర్ చేశారు ఉపాసన. కుమార్తెతో వున్న ఫోటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది అని అంటున్నారు.ఇక ఉపాస‌న.. న‌మ్ర‌త‌తో క‌లిసి వేడుక‌లు జ‌రుపుకుంది. వీరు కలిసి ఫొటోలకు పోజిచ్చారు. క్రిస్మస్ పార్టీ కావడంతో రెడ్ ట్రెండీ వేర్ ధరించారు. రెడ్ వైన్ తాగుతూ పార్టీని, పండుగను ఆస్వాదించారు. ఈ క్రిస్మస్ పార్టీలో ఉపాసన, నమ్రతల ఫ్రెండ్స్, సన్నిహితులు జాయిన్ అయ్యారు.

Ram Charan celebrated Christmas with upasana and his daughter
Ram Charan

మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు కూడా ఈ పార్టీకి హాజరు కావడం విశేషం. వారి ఫోటోలు కూడా నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సితార రెడ్ అవుట్ ఫిట్ లో చాలా అందంగా ఉంది. కొద్ది రోజులుగా చరణ్ దంపతులు ముంబైలో ఉంటున్నారు. తమ కూతురు క్లింకారతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వారికి పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. అంతేకాకుండా వారికి వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా.. చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now