గురువారం, జూన్ 11, 2026
వినోదం

Radhe Shyam : ప‌ర‌మ‌హంస పాత్ర‌లో కృష్ణం రాజు లుక్ అదిరిపోయిందిగా..!

Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే…

Radhe Shyam : ప‌ర‌మ‌హంస పాత్ర‌లో కృష్ణం రాజు లుక్ అదిరిపోయిందిగా..!

Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్ప‌డ‌గా, వ‌రుస‌గా విడుద‌లవుతున్న పోస్ట‌ర్స్, సాంగ్స్ మ‌రింత హైప్ తీసుకొస్తున్నాయి. ఈ సినిమాకి ‘జిల్’ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.

Radhe Shyam krishnam raju look released as parama hamsa

కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో.. ఈ చిత్రం ప్రమోషన్స్ లో వేగం పెంచారు. తాజాగా కృష్ణం రాజు పాత్ర‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. పరమహంస అనే సాధువు పాత్రలో ఆయ‌న లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది.

అహోబిలంలోని టెంపుల్ లో విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కు, పరమహంస పాత్రలో కనిపించనున్న కృష్ణంరాజుకు మధ్య కీలకమైన సన్నివేశాలు చిత్రీక‌రించిన‌ట్టు స‌మాచారం. తాజాగా కృష్ణం రాజుకి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్ అంద‌రినీ అల‌రించేలా ఉంది. ఈ చిత్రం సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రేక్షకులను తప్పకుండా మెప్పింస్తుందని ఈ చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి