Pushpaka Vimanam : ఆహాలో ప్రసారం కానున్న పుష్పక విమానం సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

December 2, 2021 5:49 PM

Pushpaka Vimanam : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ఆనంద్ దేవరకొండ త‌న సోద‌రుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా, దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్పక విమానంలో న‌టించాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన‌ విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య లేచిపోతే భర్త కష్టాలు ఎలా ఉంటాయో.. ఈ సినిమా ద్వారా చూపించారు.

Pushpaka Vimanam movie to stream on aha

థియేటర్ లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఆహా యాప్ ద్వారా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన‌ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఎంతో వినోదాత్మక భరితంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్ లో మిస్సైన వారు ఆహా ద్వారా చూసి ఆనందించవచ్చు.

ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నారు. మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలా విజయ్ దేవరకొండ ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now