Pushpa 2 : పుష్ప 2 మామూలుగా ఉండదట.. సుకుమార్‌ కామెంట్స్‌ వైరల్‌..

December 19, 2021 5:52 PM

Pushpa 2 : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ శుక్రవారం (డిసెంబర్‌ 17) విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్ సాధించింది. పైర‌సీ బారిన ప‌డిన కూడా మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద వార్ వన్ సైడ్‌గా కనిపిస్తోంది.

Pushpa 2 sukumar interesting comments

ఆంధ్రాలో మినహాయించి విడుదలైన ప్రతీ చోట వసూళ్ల మోత మోగిస్తోంది. అయితే తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సృష్టించిన పుష్ప‌ కోవిడ్ తర్వాత రిలీజైన చిత్రాల్లో అంటే 2021లో రికార్డు కలెక్షన్లను సాధించడమే కాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా ఓ ఘనతతో వసూళ్ల జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకి కొనసాగింపుగా ప్లాన్ చేసిన రెండో పార్ట్ పై లేటెస్ట్ గా కొన్ని కీలక కామెంట్స్ చెయ్యడం వైరల్ అవుతోంది.

పుష్ప పార్ట్ 2 షూట్ వచ్చే ఏడాది మార్చి కానీ ఏప్రిల్ నుంచి కానీ స్టార్ట్ అవుతుందని అలాగే సినిమాలో అసలు కథ అంతా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని తెలిపారు. అలాగే ఫహద్ రోల్ కూడా ఈ సినిమా నుంచే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని, ఇంకొన్ని కీలక పాత్రలు కూడా అందులో యాడ్ అవుతాయని తెలిపారు. ఇదెప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now