OTT Releases This Week : న్యూ ఇయ‌ర్‌లో తొలి వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. ఏయే సినిమాలు రానున్నాయంటే..!

January 4, 2024 11:18 AM

 OTT Releases This Week : కొత్త సంవ‌త్సరంలో స‌రికొత్త సినిమాలు ప్రేక్ష‌కులని అలరించేందుకు థియేట‌ర్‌లోకి వ‌చ్చేశాయి. ఈ వారం ‘సర్కారు నౌకరి’, ‘రాఘవ రెడ్డి’ థియేటర్స్ లో విడుద‌ల‌య్యాయ. మరోవైపు ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నెట్‍ఫ్లిక్స్ లో చూస్తే ముందుగా నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన హాయ్ నాన్నచిత్రంపై అంద‌రి దృష్టి ఉంది. జనవరి 4వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హాయ్ నాన్న థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జనవరి 4న నెట్‍ఫ్లిక్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇక తమిళ హారర్ మూవీ కన్‍జ్యూరింగ్ కన్నప్పన్.. జనవరి 5న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఫూల్ మీ వన్స్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – జనవరి 5, గుడ్ గ్రీఫ్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – జనవరి 5, మ్యాన్ ఆన్ ది రన్ – డాక్యుమెంటరీ ఫిల్మ్ – నెట్‍ఫ్లిక్స్ – జనవరి 5, సొసైటీ ఆఫ్ ది స్నో – సినిమా- నెట్‍ఫ్లిక్స్ – జనవరి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూస్తే.. ఫోయి – సినిమా – అమెజాన్ ప్రైమ్ వీడియో – జనవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, జేమ్స్ మే: ఔర్ మ్యాన్ ఇన్ ఇండియా – సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో – జనవరి 5 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

 OTT Releases This Week know about the movies
OTT Releases This Week

ఆహాలో స్టూడెంట్స్ కామెడీ థ్రిల్లర్ ‘బాయ్స్ హాస్టల్’ సినిమా జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఆహాలో కూడా అడుగుపెట్టనుంది. ఇక డిస్నీ+ హాట్‍స్టార్ లో పెరిల్లూర్ ప్రీమియల్ లీగ్ – మలయాళ సినిమా – డిస్నీ+ హాట్‍స్టార్ – జనవరి 5 (తెలుగు వెర్షన్ కూడా), క్యుబికల్స్ సీజన్ 3 – వెబ్ సిరీస్ – సోనీ లివ్ – జనవరి 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈటీవీ విన్ లో నైంటీస్ (90s) వెబ్ సిరీస్ కూడా జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. 1990ల్లో మధ్య తరగతి కుటుంబం చుట్టూ ఈ సిరీస్ ఉంటుంది. సీనియర్ నటుడు, ఇటీవలే బిగ్‍బాస్ షో ఆడిన శివాజీ ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించారు. అలానే జీ5 లో బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన తేజస్ సినిమా జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now