NTR : ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

December 21, 2021 5:55 PM

NTR : ఆర్ఆర్ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ముంబైలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు హాజ‌ర‌య్యారు. అయితే ఫ్యాన్స్ ప్ర‌వ‌ర్త‌న ఎన్టీఆర్‌కి అస్స‌లు న‌చ్చ‌క పోవ‌డంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

NTR given sweet warning to his fans

అభిమానులు కొంద‌రు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చారు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. అందరూ కిందకు దిగుతారా ? లేదా ? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి.. అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి.. అంటూ అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతోపాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టాడు. నాటు నాటు పాట కూడా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now