Nithin : మొన్నటి వరకు రష్మిక మార్ఫింగ్ వీడియో సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు త్రిష వ్యవహరం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరికి సినీ, రాజకీయ ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. విలన్ పాత్రలు చేస్తూ అందరిని మెప్పిస్తున్న నటుడు మన్సూర్ అలీఖాన్ రీసెంట్‌గా నటి త్రిషపై రేప్ సీన్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నేను చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ చేశాను. ఆ సీన్స్‌లో నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో కూడా నాకు రేప్ సీన్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ, ఆ సినిమాలో అలాంటి సీన్ లేదు అని బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మన్సూర్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై త్రిష స్పందిస్తూ.. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అంటూ త్రిష తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇక ఇలాంటి కామెంట్స్ చేసిందుకు మన్సూర్‌పై రోజా, ఖుష్బూ, లోకేష్ కనగరాజ్ , కార్తీక్ సుబ్బరాజు, సింగర్స్ మాళవిక, చిన్మయి, నటుడు నితిన్.. ఇలా చాలామంది సెలబ్రిటీలు అతనిపై దుమ్మెత్తిపోస్తూ త్రిషకి అండగా నిలిచారు.
తాజాగా టాలీవుడ్ నటుడు నితిన్ కూడా త్రిషకి తన సపోర్ట్ అందించారు. త్రిషకి మద్దతుగా నితిన్ కామెంట్స్ చేస్తూ.. త్రిషపై మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటు లేదు అని చెప్పుకొచ్చారు. మహిళలకు వ్యతిరేకంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలని ప్రతి ఒక్కరూ ఖండించాలి అంటూ నితిన్ త్రిషకి తన సపోర్ట్ అందించారు. కాగా నితిన్, త్రిష జంటగా గతంలో అల్లరి బుల్లోడు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…