Actors Wives Income : సెలబ్రిటీల జీవితాలెప్పుడు గోప్యంగానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా హీరోల భార్యలు,వారి కుటుంబాల గురించి. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యలు భర్తలతోపాటుగా వారు కూడా వారికి నచ్చిన రంగాల్లో స్థిరపడుతున్నారు. సినీ పరిశ్రమలో హీరోగా సెటిలై మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయకుల భార్యలు భర్త సంపాదన మీద ఆధార పడకుండా స్వతహాగా తమ ఆదాయ మార్గాలను వారు అన్వేషించుకుంటున్నారు.
నేచురల్ స్టార్ నాని భార్య అంజనా బెంగళూరు నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకుంది. పెళ్లి తర్వాత వారికొక బాబు కూడా పుట్టాడు. ఈ మధ్యకాలంలో అంజనా.. రాజమౌళి ఆర్కామీడియాలో జాయిన్ అయింది. క్రియేటివ్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పని చేస్తుంది. బాహుబలి సినిమా క్యాస్టూమ్స్ విషయంలో కీలకపాత్ర అంజనాదే. రాజమౌళి, నాని కాంబినేషన్‌లో ఈగ సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే.
యాంకర్ సుమ సంపాదన గురించి మనకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకవైపు యాంకరింగ్ తోపాటు నిర్మాణరంగంలో అడుగుపెట్టింది సుమ. యాంకర్ గా ఊపిరి సలపకుండా అన్ని కార్యక్రమాలతో బిజీగా ఉ:డే సుమ సంపాదన మనకు కొత్తేం కాదు. అసలు ఈమె ఎప్పుడు రెస్ట్ తీసుకుంటది అనిపిస్తుంది. సుమ సంపాదన రాజీవ్ సంపాదన కంటే చాలా ఎక్కువ.
ఉపాసన గురించి మనకు తెలియని విషయాలు అంటూ ఏం లేవు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పడు వార్తల్లో ఉంటుంది. అపోలోలో చురుకైన పాత్రతో పాటు సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది.
అల్లరి నరేశ్ భార్య విరూప కార్పొరేట్ శుభకార్యాలు చేస్తుంది. అవునండీ విరూప ఈవెంట్ మేనేజర్ గా చేస్తుంది. ఒక్క ఈవెంట్ కే లక్షలు, కోట్లల్లో టారిఫ్ ఉండే వాటిల్లో విరూప సంపాదన అల్లరి నరేశ్ సంపాదన కంటే రెట్టింపు.
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పెక్ట్రం అనే మ్యాగజైన్ కి ఛీఫ్ ఎడిటర్ గా పనిచేస్తుంది .విదేశాల్లో చదువుకున్న స్నేహ పెళ్లికి ముందు కూడా తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇనిస్టిట్యూట్ బాధ్యతలు చూసుకునేది. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూ ఇటు తల్లి పాత్ర అటు మ్యాగజైన్ ఎడిటర్, మరోవైపు సెయింట్ ఇనిస్టిట్యూట్స్ ని చూసుకుంటుంది.
అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ తన భార్య తన కన్నా ఎక్కువ ఇన్ కం ట్యాక్స్ పే చేస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమె ఎవరో కాదు గాయని చిన్మయి. ఏం మాయ చేశావ్ సినిమాలో సమంతకి డబ్బింగ్ చెప్పింది కూడా ఈమెనే.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…