Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం పెద్దగా సక్సెస్ లేకపోయిన మనోడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వైవిధ్యమైన సినిమాలతో దూసుకు పోతున్నారు. ఈ ఏడాది మొత్తం మూడు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా వీటిలో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మాత్రం ఓ మోస్తరుగా అలరించింది. కిరణ్ అబ్బవరం చివరగా రూల్స్ రంజన్ అంటూ వచ్చాడు. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అలా కిరణ్ అబ్బవరంకు ఇప్పుడు కాస్త బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. రానున్న రోజుల్లో కిరణ్ అబ్బవరం నుంచి ఓ పాన్ ఇండియా మూవీ వస్తుందనే టాక్ వినిపించింది.
ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. అషు రెడ్డిని హోస్టుగా పెట్టి కొత్త టాక్ షో ‘దావత్’ ని మొదలు పెట్టింది. ఈ టాక్ షోకి తొలి గెస్ట్‌గా యువ హీరో కిరణ్ అబ్బవరంని గెస్ట్ గా వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కిరణ్ కి సంబంధించిన అనేక విషయాలను ఆడియన్స్ కి తెలియజేశారు అషు రెడ్డి. కాగా కిరణ్ అబ్బవరం తన నటించిన సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బడా స్టార్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాదిరిగానే తాను చేస్తున్నాడని టాక్ నడిచింది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరంకి దాని గురించి అషూ ప్రశ్న వేసింది.
దానిపై స్పందించిన కిరణ్ అబ్బవరం ముందు ఎంతో కొంత తీసుకోవడం కంటే.. సినిమా అంతా అయ్యాక.. నిర్మాతకు పెట్టింది వచ్చాక.. లాభాలు వస్తే తీసుకుందామనుకుంటాను.. అందులో షేర్ తీసుకుంటాను.. ఒక వేళ సినిమా పోతే.. నిర్మాతకు ఏం రాకపోతే.. నేను కూడా ఏమీ తీసుకోను అంటూ ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చాడు. మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే చిత్రాలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు అని చేశారా? అంటూ అషూ అడిగింది. అవును అంటూ సమాధానం ఇచ్చాడు. ఒక వేళ మీరే నిర్మాతలు అయి ఉంటే ఆ సినిమాలు నిర్మించేవారా? అని మళ్లీ అడిగింది అషూ. నిర్మాతగా అయితే నిర్మించేవాడ్ని కాదని అంటాడు. ఇలా కిరణ్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…