Natu Natu Song : నాటు నాటు పాట‌కు స్టేజ్ మీద లైవ్‌ పెర్‌ఫార్మెన్స్ చేయ‌నున్న రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్

December 19, 2021 5:26 PM

Natu Natu Song : ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ సాగుతున్నాయి. ఇటీవ‌ల‌ ‘నా పాట చూడు.. నా పాట చూడు.. నాటు నాటు వీర నాటు’ అంటూ విడుద‌లైన సాంగ్ ఎంత ర‌చ్చ లేపిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంత క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ‘నాటు నాటు’ పాట స్టెప్స్‌ కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చెప్పారు తారక్‌.

Natu Natu Song  ram charan tej and ntr to perform live for that song

అయితే ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నేడు ముంబైలో జ‌ర‌గ‌నుండగా, ఈ ఈవెంట్ కి కండల వీరుడు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వస్తారని తాజాగా సమాచారం అందుతోంది. కాఫీ విత్ కరణ్ షో తో మరింత పాపులర్ అయిన డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ స్టేజీ మీద హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ ఆలియా భట్ లతో రాపిడ్ ఫైర్ రౌండ్ ని ఫిల్టర్ కాఫీ పేరుతో చేయనున్నారట. మ‌రోవైపు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ నాటు నాటు సాంగ్‌ని స్టేజ్‌పై లైవ్‌లో పెర్‌ఫార్మెన్స్ చేయ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

‘‘నాటు నాటు‘‘ పాటలోని హుక్‌ స్టెప్‌.. కాళ్లు ఎడమ, కుడి, ముందు, వెనుక తిప్పి స్టెప్‌ పర్ఫెక్ట్‌గా సింక్‌ అయ్యేందుకు చెర్రీ, తార‌క్ 15-18 టేక్స్‌ తీసుకున్నారు. అందరూ ఆ హుక్‌ డ్యాన్స్‌ స్టెప్స్‌ సింక్‌ బాగుందంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఈ పాట ర‌చ్చ చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now