Mahesh Babu Hobbies : కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం మహేష్ బాబుది. సూపర్ స్టార్ మహేష్ బాబుది గోల్డెన్ హార్ట్ అంటూ కొనియాడుతారు అభిమానులు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఒకడైన మహేష్.. ఎన్నో ఏళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఆసుపత్రి భాగస్వామ్యంతో అతను ఎంతోమంది అభాగ్యులైన చిన్నారుల ప్రాణాలు కాపాడాడు.
మహేష్ బాబు ఫౌండేషన్ పేరు మీద 2500 గుండె ఆపరేషన్లు జరిగాయంటే ఆయన మంచి మనస్సు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తన కొడుకు పుట్టినపుడు చిన్న ఇబ్బంది తలెత్తితే.. అది చూసి పేద చిన్నారులకు సమస్య తలెత్తితే ఎలా అనే ఆలోచనతో ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు మహేష్ బాబు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద విద్యా నిధి పథకాన్ని ప్రారంభించాడు. ప్రాథమికంగా 40 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంచుకుని.. వారికి స్కూల్ స్థాయి నుంచి పీజీ వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.తండ్రికి మహేష్ ఇస్తున్న గొప్ప నివాళి ఇదంటూ ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పైన చాలా రూమర్లు వస్తున్నాయి.ఎందుకంటే ఇప్పటికే సినిమాని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు.సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనే సందేహం కూడా ఉంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కూడా మహేష్ ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఇంక ఖాళీ ఉంటే పుస్తకాలు ఎక్కువగా చదువుతాడట. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల బుక్స్ మహేష్ చదువుతాడనే టాక్ ఇప్పుడు ఉంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…