Keedaa Cola OTT Release : కీడా కోలా మూవీపై క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలో ఎప్ప‌టి నుండి సంద‌డి చేయ‌నుంది అంటే..!

December 19, 2023 9:17 PM

Keedaa Cola OTT Release : ప్ర‌తి వారం కూడా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు వస్తూనేవుంటాయి. అయితే విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తించే సినిమాలు మాత్రం అరుదుగా వస్తూ ఉండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి అరుదైన సినిమాల‌లో ‘కీడాకోలా’ ఒక‌టి. ఈ సినిమాపై అంచనాలు ఉండటానికి ఒకే ఒక కారణం దర్శకుడు తరుణ్‌భాస్కర్.క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ని బాగా అలరిస్తూ మంచి విజయం సాధించింది కీడా కోలా సినిమా.తక్కువ బడ్జెట్ లో అందరు చిన్న ఆర్టిస్టులతోనే తీసిన ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగానే రాబ‌ట్టింది.

సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయ‌గా, మంచి విజ‌యం సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన భారీగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. చైతన్యరావు, కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీపై ఆహా క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ట్వీట్‌లో.. ఈ సీసాలో ఏదో క్రేజీగా ఉంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు త్వరలో వస్తోంది. కోడాకోలా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. సీసాలో నుంచి బొద్దింక వచ్చేలా మూవీ థీమ్‍తో ఓ వీడియో పోస్ట్ చేసింది.ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది.

Keedaa Cola OTT Release know the platform and streaming details
Keedaa Cola OTT Release

తరుణ్ భాస్కర్ సినిమాని ముందుండి చాలా కొత్తగా ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కూడా చేశాడు. కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. చిత్రంలో అందర్నీ నవ్వించేసేసి, తప్పులన్నింటినీ కనపడకుండా చేసేశాడు తరుణ్‌భాస్కర్‌. ముఖ్యంగా వాస్తు అండ్‌ గ్యాంగ్‌, జీవన్‌ అండ్‌ గ్యాంగ్‌ ఎదురెదురు పడే సన్నివేశంలో అయితే పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. నవ్వించటానికి సినిమా తీశాడు.. నవ్వించాడు. తన లక్ష్యాన్ని సాధించాడు. సాంకేతికంగా ఎక్కడ కూడా వంక పెట్టటానికి లేదు. అన్ని విధాలా సినిమా బావుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now