గురువారం, జూన్ 11, 2026
వినోదం

Kajal Aggarwal : కాజ‌ల్ బేబీ బంప్ ఫొటోలు వైర‌ల్‌.. షాక్‌లో ఫ్యాన్స్..!

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్. ఈ అమ్మ‌డు ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై చంద‌మామ సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఇటు సీనియ‌ర్ హీరోలు, అటు…

Kajal Aggarwal : కాజ‌ల్ బేబీ బంప్ ఫొటోలు వైర‌ల్‌.. షాక్‌లో ఫ్యాన్స్..!

Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న అందాల ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్. ఈ అమ్మ‌డు ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మై చంద‌మామ సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది. ఇటు సీనియ‌ర్ హీరోలు, అటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గతేడాది అక్టోబర్‌ 30న తన చిరకాల మిత్రుడు, ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

Kajal Aggarwal shared latest photo netizen say she is pregnant

గ‌త కొద్ది రోజులుగా కాజ‌ల్ గ‌ర్భ‌వ‌తి అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె సినిమాల‌ను సైతం రిజెక్ట్ చేస్తుంద‌నే ప్ర‌చారం కూడా సాగింది. అయితే ఇటీవ‌ల దీనిపై కొంద‌రు ప్ర‌శ్నించ‌గా, కాజ‌ల్ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చెబుతాన‌ని పేర్కొంది. తాజాగా కాజల్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను నెటిజన్లు పట్టేసి వైరల్‌ చేస్తున్నారు.

కాజ‌ల్ తాజాగా తన స్నేహితులతో కలిసి సరదాగా దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇందులో కాజల్‌ కు కాస్త బేబీ బంప్‌ ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చిందని అభిమానులు భావిస్తున్నారు. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి కాజల్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఇప్పుడు కాజల్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండడంతో త్వరలోనే కాజల్ ఈ విషయంపై స్పందిస్తుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి