Jigarthanda Double X OTT Release Date : జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. స్ట్రీమింగ్ అందులోనే..!

December 1, 2023 6:58 PM

Jigarthanda Double X OTT Release Date : ఇప్పుడు ఎంత పెద్ద సూప‌ర్ హిట్ చిత్ర‌మైన సరే థియేట‌ర్‌లో వ‌చ్చిన నాలుగైదు వారాల‌కే ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. ఇటీవ‌ల కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం ప‌ర్వాలేద‌నిపించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. విడుదలై నెలరోజులు అవ్వకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండడం గమనార్హం. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘జిగర్తాండ డబల్ ఎక్స్ చిత్రం 2014లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్, బాబీసింహ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఈ సినిమాకి సీక్వెల్‌గా జిగ‌ర్తాండ డబుల్ ఎక్స్ అనే చిత్రం చేశారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 8) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో తీసుకురానున్నారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, నిమేషా సజయన్‌, సత్యన్‌, అర్వింద్‌ ఆకాష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ కలెక్షన్లు నిరాశపరిచినప్పటికీ తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ మూవీకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.

Jigarthanda Double X OTT Release Date
Jigarthanda Double X OTT Release Date

చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉందంటూ ధనుష్ చేసిన ట్వీట్ సినిమాపై కొంత ఆస‌క్తిని క‌లిగించింది. ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానం, ఎస్‌.కథిరేసన్‌, అలంకార్‌ పాండియన్‌ నిర్మాతలుగా వ్యవహారించారు. తిరు సినిమాటోగ్రఫీ, షఫీక్‌ మహ్మద్‌ అలీ ఎడిటింగ్ ఆకట్టుకుంది. సినిమాలో లారెన్స్, SJ సూర్య తమ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆడియన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now