Jagapathi Babu : ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన హీరో జగపతి బాబు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు ఒకానొక సమయంలో మాత్రం చాలా దీన పరిస్థితిలో కూడా ఉన్నాడు. బ్యాంక్ ఎకౌంట్ లో రూపాయి లేని రోజును చూశాడు. అలాంటి జగపతిబాబు ఇప్పుడు నెగిటివ్ పాత్రలతో మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ఆయన తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఓ హీరో తో సినిమా చేస్తున్నప్పుడు సెట్‌లో సరిగ్గా భోజనం కూడా పెట్టలేదు అని చెప్పాడు జగపతిబాబు .. గౌరవం కూడా ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక లైట్ మ్యాన్ వచ్చి అయితే నా కాళ్ళ దగ్గర కూర్చొని కూడా ఆ పరిస్థితిని చూసి ఏడ్చాడు. ఆ విధమైన ఎన్నో చేదు అనుభవాలను నేను ఎదుర్కొన్నాను. మొదట్లో అలాంటి మూమెంట్స్ అంటే ఏమిటో నాకు తెలియలేదు. కానీ అలాంటి బాధలు ఎదురైనప్పుడు మాత్రం అదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని ఆయన అన్నాడు. ఆస్తుల గురించి అయితే నేను పెద్దగా పట్టించుకోను డబ్బు అనేది మనిషికి ఒక జబ్బు లాంటిది. ఒక పరిధి వరకు సంపాదించుకోగలిగితే బాగుంటుంది కానీ.. అది లిమిట్ దాటితే టెన్షన్ తప్ప మరొకటి ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు.
నేను సంపాదించిన ఆస్తుల విలువ ఇప్పుడు 1000 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, అంతలా ఆస్తులు పోగొట్టుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పటికీ ప్రశ్నగానే మారింది. క్యాసినోతో ఆస్తులు పోలేదు. నేను సరదాకు మాత్రమే అవి ఆడతాను. అంత డబ్బు ఎలా పోయిందనే దానికి క్లారిటీ లేదు. ఒకరిని బ్లేమ్ చేయను .. చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. బ్రోకర్స్ వల్ల కావచ్చు. నేను కూడా అజాగ్రత్తగా ఉండకపోవడంతో అలా జరిగి ఉండచ్చు. ఇందులో నా పొరపాటు కూడా తప్పక ఉండి ఉంటుందని జగపతి బాబు స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…