సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటి నుండో చూస్తున్నాం. అయితే వారసులుగా వచ్చిన వారిలో కొందరు రాణించగా, మరి కొందరు మాత్రం మధ్యలోనే డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో రాబోయే వారసుల లిస్టు అయితే పెద్దగానే ఉంది. అయితే అందులో ఎక్కువగా మాత్రం మహేష్ బాబు పవన్ వారసులపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఇండస్ట్రీలో దాదాపు ఓకే తరహాలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలయితే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో అయితే ఓపెనింగ్స్ అందుకుంటూ ఉంటాయి. ఇద్దరు స్టార్ హీరోలో ఫ్యాన్స్ మధ్య అప్పుడప్పుడు కొన్ని గొడవలు కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో ఇప్పుడు గౌతమ్ ఘట్టమనేని , అకిరా నందన్ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ మధ్యలో వార్స్ కూడా కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే విధంగా ఓవర్గం వారు అనవసరపు కామెంట్స్ చేసుకుంటూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు టాలీవుడ్ నుంచి చాలా మంది స్టార్స్ హాజరయ్యారు. నాగార్జున, రామ్‌చరణ్, నాగచైతన్య, అఖిల్‌తో పాటు పలువురు హీరోలు రేసింగ్ పోటీల్లో సందడిచేశారు.
అయితే ఈ పోటీల్లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, మహేష్‌బాబు వారసుడు గౌతమ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. గౌతమ్ ఘట్టమనేని చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచంలో కనిపించాడు. ఇక తన స్నేహితులతో కలిసి అకీరా ఈ రేసింగ్ పోటీలను తిలకించాడు. అతడి ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్‌గా మారాయి. క్యాప్ పెట్టుకొని స్టైలిష్‌గా అకీరా నందన్ కనిపించాడు. వీరిద్దరిని చూసిన అభిమానులు రాబోయే కాలానికి కాబోయే స్టార్స్ వీరిద్దరు అంటూ నానా రచ్చ చేస్తున్నారు. అంతేకాదు పోటీలు పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్, మహేష్‌ల కిడ్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తారో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…