Jabardasth : షాకింగ్‌.. జ‌బర్ద‌స్త్ నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ అవుట్‌.. క‌న్నీటితో వీడ్కోలు..!

December 7, 2021 6:00 PM

Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్ షోలో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ షోలో ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ టీమ్‌గా కొనసాగుతూ వచ్చిన సుడిగాలి సుధీర్ టీమ్ ముగ్గురు మిత్రులు షోకు గుడ్ బై చెప్పారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వీరు జ‌బ‌ర్ద‌స్త్ షోను వీడుతారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల‌ను నిజం చేశారు. జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పైనే ఈ విషయాన్ని వెల్ల‌డించారు.

Jabardasth sudigali sudheer team got out from the show

గ‌త కొంత కాలంగా జ‌బ‌ర్ద‌స్త్ షో అనేక వివాదాలకు మారుపేరుగా నిలిచింది. తాజాగా మ‌హిళా కంటెస్టెంట్ల‌ను టీమ్ లీడ‌ర్స్ వేధిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాల‌పై ఎవ‌రూ స‌మాధానం ఇవ్వ‌లేదు. ఇక తాజాగా సుధీర్ టీమ్ బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా విడుద‌ల చేసిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ ఎప్ప‌టిలాగే స్కిట్ చేశారు. అనంత‌రం సుధీర్‌, శ్రీ‌ను, రామ్ ప్ర‌సాద్ ముగ్గురూ స్టేజిపైకి వ‌చ్చి తాము జ‌బ‌ర్ద‌స్త్‌ను వీడుతున్న‌ట్లు తెలిపారు. త‌రువాత క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో షోలో జ‌డ్జి రోజాతో స‌హా అంద‌రూ షాక‌య్యారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 10వ తేదీన శుక్ర‌వారం ప్ర‌సారం కానుంది.

అయితే ఇది వ‌చ్చే ఎపిసోడ్‌కు చెందిన ప్రోమో క‌నుక న‌మ్మ‌డానికి లేదు. ఇటీవ‌ల జ‌బ‌ర్ద‌స్త్ షోకు రేటింగ్స్ త‌క్కువ కావ‌డంతో రేటింగ్స్ పెంచుకునేందుకు ఇలాంటి ప్ర‌యోగాల‌ను మొద‌లు పెట్టారు. ఈ మ‌ధ్య కాలంలో వారు చేసిన ఇలాంటి ప్ర‌యోగాల‌తో అభాసు పాల‌య్యారు కూడా. అయితే తాజాగా వ‌చ్చిన ప్రోమోను చూస్తే వారు నిజంగానే జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయారా.. లేక‌.. రేటింగ్స్ కోసం అలా చేశారా ? అన్న‌ది సందేహంగా మారింది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎపిసోడ్‌ను చూస్తే అస‌లు విష‌యం తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now