Jabardasth : జ‌బ‌ర్దస్త్ కు మరో ఇద్ద‌రు టీమ్ లీడ‌ర్స్ గుడ్ బై..!

December 20, 2021 8:59 AM

Jabardasth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మైంట్ అందిస్తున్న షో జ‌బ‌ర్ధ‌స్త్‌. ఈ కార్య‌క్ర‌మం 2013లో మొద‌లు కాగా, ఇప్ప‌టికీ అప్ర‌తిహ‌తంగా సాగుతోంది. ఎంతో మంది కమెడియన్స్‌, జడ్జిలు వచ్చి వెళ్లారు. కానీ షో మాత్రం ఆగిపోకుండా కొనసాగుతూనే ఉంది. అయితే షో నుండి ప‌లువురు క‌మెడియ‌న్స్, లీడ‌ర్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. కొంద‌రు పూర్తిగా బ‌య‌ట‌కు వెళ్ల‌గా, మ‌రి కొంద‌రు రీ ఎంట్రీ ఇచ్చారు.

Jabardasth another two team leaders said good bye

అయితే అదిరే అభి జబర్దస్త్‌ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మా టీవీలో నాగబాబు, శ్రీదేవి జడ్జిలుగా ఉన్న కామెడీ స్టార్స్‌ ప్రోగ్రామ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. మరో టీమ్‌ లీడర్‌గా పని చేసిన జిగేల్‌ జీవన్‌ కూడా జబర్దస్త్‌ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోను చూస్తే వీరు జబర్దస్త్‌ వీడినట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

ఇటీవల జబర్దస్త్ రేటింగ్ క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంది. పాత వారు పోవ‌డం, కొత్త వారు రావ‌డం, ఈ షోకి పోటీగా ప‌లు కామెడీ షోలు పుట్టుకు రావ‌డం వంటివి కూడా షో రేటింగ్ త‌గ్గేలా చేస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది క‌మెడీయ‌న్స్ చిన్న చిన్న‌గా జ‌బ‌ర్ధ‌స్త్ నుండి త‌ప్పుకొని ఇత‌ర కామెడీ షోల‌లో సంద‌డి చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now