Dunki OTT : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల షారూఖ్ షారూఖ్ ఖాన్ మంచి హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, తాప్సీ జంటగా విక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో డంకీ అనే చిత్రం చేయగా, ఈ మూవీ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది. ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో సూపర్ డూపర్ హిట్ షారూఖ్ ఖాన్ కొట్టడంతో ఆయన నటించిన డంకీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు సినిమాలు మాస్ యాక్షన్ అయితే డంకీ ఎమోషనల్ డ్రామాగా రూపొందింది.
చిత్రంలో షారుఖ్ ఖాన్.. హార్డీ పాత్రలో ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించి, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకులు ఏడ్చేలా చేస్తాడు. ఇక 50 ఏళ్ళ వయసు పాత్రలో కూడా షారుఖ్ అదరగొట్టాడు. తాప్సి కూడా యంగ్, ముసలి పాత్రలో ఎమోషన్ తో మెప్పిస్తుంది. విక్కీ కౌశల్ గెస్ట్ రోల్ చేసినా ఉన్న పావుగంట ప్రేక్షకులని చాలా ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు. మొత్తంగా షారుఖ్ ఖాన్ గత సినిమాల్లో యాక్షన్ తో మెప్పిస్తే ఈ సారి రాజ్ కుమార్ హిరాణి మార్క్ ఎమోషనల్ టచ్ తో ప్రేక్షకులని నవ్వించి, ఏడిపించాడు అని చెప్పాలి. ఈ చిత్రంతో షారూఖ్ ఖాన్ తన ఖాతాలో మరో మంచి హిట్ చిత్రం వేసుకున్నాడనే చెప్పాలి.
పఠాన్, జవాన్ తరహాలోనే హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డంకీని విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో కేవలం హిందీలోనే డంకీని రిలీజ్ చేశారు. అయితే డంకీ ఏ ప్లాట్‌ఫాంలో రానుందనే ఆలోచన అందరిలో ఉండగా, దీనికి ఓ క్లారిటీ అయితే వచ్చింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్‌ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దాంతో జియో సినిమాలో డంకీ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తుంది. రూ. 155 కోట్లు పెట్టి డంకీ సినిమాని జియో కొనుగోలు చేసిందని సమాచారం. మరి ఎప్పుడు దీనిని స్ట్రీమింగ్ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…