Dunki Day 1 Collection : ఇటీవలి కాలంలో షారూఖ్ ఖాన్ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు.పఠాన్, జవాన్ చిత్రాలతో మంచి విజయాలు సాధించిన షారూఖ్.. డంకీ మూవీతో హ్యాట్రిక్ కొడతానని అందరు అనుకున్నరు. కాని ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించలేదు. డంకీ చిత్రం డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, సంజూ, 3 ఇడియెట్స్ లాంటి చిత్రాలను అందించిన రాజ్‌కుమార్ సినిమా కావడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే జరిగింది. కానీ షారుక్ సినిమాలు పఠాన్, జవాన్ స్థాయిలో జరగలేదని చెప్పాలి.డంకీ చిత్రాన్ని సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే అంటే దాదాపు 150 కోట్ల మేర జరిగింది.
ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టలేదు. కేవలం 30 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఈ ఏడాది రిలీజైన షారుఖ్ ఖాన్ సినిమాలు పఠాన్ , జవాన్ చిత్రాలకి మంచి వసూళ్లు రాగా, డంకీ మాత్రం తొలి రోజు బాగా నిరాశపరచింది. షారుఖ్‌ఖాన్ జవాన్ మూవీ తొలిరోజు 89 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, పఠాన్ 57 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. డంకీ చిత్రానికి సంబంధించి నేషనల్ మల్టీప్లెక్స్‌లో టికెట్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. ఈ సినిమా టికెట్లు ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్, సినీ పోలీస్ లాంటి స్క్రీన్లలో 300000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 18 కోట్ల రూపాయల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధించింది.
డంకీ మూవీ తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద షారుక్ స్టామినాకు తగినట్టుగా కాసులు వర్షం కురిపించలేకపోయింది. పఠాన్, జవాన్ సగం వసూళ్లు కూడా ఈ మూవీ రాబట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.అడ్డ దారుల్లో విదేశాలకు వలస వెళుతోన్న వారి జీవితాలను వినోదం, ఎమోషన్స్ కలగలిపి ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ. అయితే ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…