NTR : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడేళ్లు కేటాయించిన ఎన్టీఆర్.. ఎన్ని సినిమాలు వ‌దులుకున్నాడో తెలుసా?

December 10, 2021 2:22 PM

NTR : రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ప్ర‌స్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌, ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోర్రీస్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ డానయ్య ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదల కానుంది.

do you know how many movies NTR lost because of RRR movie

ఈ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాలను వేగ‌వంతం చేశారు. ముంబైలో చిత్ర ట్రైల‌ర్ ఈవెంట్ నిర్వ‌హించ‌గా, ఈ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఆయ‌న‌కు మీడియా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌గా, త‌న‌దైన శైలిలో జ‌వాబు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్ని ఆఫ‌ర్స్ వ‌దులుకున్నార‌ని ఓ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నించగా, దానికి షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. నేను ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి పెట్టానని.. రాజమౌళితో సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు నాకు మరో ఆఫర్ ఎవరిస్తారంటూ ఫ‌న్నీగా చెప్పుకొచ్చాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న ఎన్టీఆర్ త్వ‌ర‌లో స‌లార్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్, బుచ్చిబాబుతో పాటు ప‌లువురు ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌నున్నాడు.

అయితే ప్రస్తుత తరుణంలో స్టార్‌ హీరోలు అందరూ ఏడాదికి ఒక సినిమాను చేస్తున్నారు కనుక.. ఎన్‌టీఆర్‌ కూడా 3, 4 సినిమాలను వదులుకున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now