Rashi Khanna : పుష్ప టిక్కెట్స్ అడిగిన మారుతి.. లేవ‌ని చెప్పిన రాశీ ఖ‌న్నా..

December 17, 2021 1:23 PM

Rashi Khanna : బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక సినిమా పుష్ప‌. ఈ మూవీ మొద‌టి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో నేడు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. సుకుమార్ ఇచ్చిన ప్రతి అప్‌డేట్ కూడా ఆ అంచనాలకు రెక్కలు కట్టింది. తొలి షో కంటే ముందే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ త‌మ స్పంద‌న తెలియ‌జేస్తున్నారు.

director maruthi asked for pushpa movie tickets Rashi Khanna given reply

అయితే పుష్ప సినిమా టిక్కెట్స్ కోసం సామాన్యుల‌తోపాటు సెల‌బ్స్ సైతం క‌ష్ట‌ప‌డుతున్నారు. ద‌ర్శ‌కుడు మారుతి ‘పుష్ప’ సినిమా కోసం హైదరాబాద్‌లో ఎర్లీ మార్నింగ్‌ షో టికెట్లు కావాలి.. అని కామెంట్ పెట్టాడు. అది కూడా 20 టిక్కెట్స్. దీనికి హీరోయిన్‌ రాశీఖన్నా.. ‘కష్టం సార్‌.. నేను కూడా ట్రై చేస్తున్నా’ (నవ్వుతున్న ఎమోజీతో) రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి.

బన్నీకి అత్యంత ఆత్మీయుడైన మారుతికి సినిమా టికెట్‌ దొరకకపోవడం ఏంటి ? విడ్డూరం కాకపోతే.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాశీ ఖ‌న్నా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. గోపీచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ వస్తోంది.

గతంలో జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశి ఖన్నా. హీరోయిన్ రాశీ ఖన్నా ఆకాశం నుంచి నేలపైకి వస్తున్న దేవకన్యలా క‌నిపించ‌నున్నారు. ఈమె క్యారెక్టర్‌ను ప్రతిరోజూ పండగే మాదిరే ఇందులోనూ మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now