Dhee Show : ఢీ షో నుండి సుధీర్, ర‌ష్మీ ఔట్.. బిగ్ బాస్ అఖిల్, మోనాల్ ఇన్..

December 12, 2021 1:40 PM

Dhee Show : ప్రముఖ డ్యాన్స్ షో ఢీ స‌క్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. రీసెంట్‌గా ఢీ 13 ఫినాలే జ‌ర‌గ‌గా ఇందులో కావ్యశ్రీ విజేతగా నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. ఇక ఇప్పుడు రాబోయే సీజన్ ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సారి ఢీ జూనియర్స్, ఢీ లేడీస్ స్పెషల్, ఢీ జోడీ, ఢీ ఛాంపియన్స్ అనే నాలుగు టీమ్‌లతో షో ప్లాన్ చేయబడింది. రీసెంట్‌గా విడుద‌లైన ప్రోమోను చూస్తుంటే ప‌లు మార్పుల‌తో షో ను ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Dhee Show sudheer and rashmi out bigg boss akhil and monal in

యాంకర్​గా ప్రదీప్​.. టీమ్ ​లీడర్లుగా హైపర్ ఆది, ‘బిగ్​బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపించారు. జడ్జిలుగా ప్రియమణి, గణేష్ మాస్టర్ ఉన్నారు. తొలి ఎపిసోడ్​కు ‘లక్ష్య’ హీరో హీరోయిన్లు నాగశౌర్య, కేతిక శర్మ విచ్చేసి సందడి చేశారు. అలాగే డాన్సర్ ​తేజస్వినితో కలిసి హిప్​ మూవ్‌మెంట్‌ ​చేసిన హైపర్ ఆది తెగ నవ్వించారు. అయితే స్మాల్ స్క్రీన్ జోడీ సుడిగాలి సుధీర్, రష్మి ఇందులో క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

దాదాపు ఐదు సీజన్లలో టీమ్ లీడర్‌లుగా కనిపించిన సుధీర్ – ర‌ష్మీ జంట ప్రోమోలో క‌నిపించ‌క‌పోవ‌డంతో వారి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సుధీర్ లేకపోవడంతో రష్మీ కూడా ఈ సీజన్‌లో కనిపించదని అంటున్నారు. అందుకే ఆమె స్థానంలో మోనాల్ గజ్జర్ ను రంగంలోకి దింపుతున్నారట. ఇతర టీమ్ లీడర్‌గా దీపికా పిల్లి కొనసాగవచ్చు. బిగ్ బాస్ రొమాన్స్‌ని ఇక్క‌డ మ‌రోసారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి చూపించేందుకు ఢీ నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now