వినోదం

చిరంజీవి ‘విశ్వంభర’లో ఎనిమిది టైటిల్ కార్డ్స్.. ఆ 20 నిమిషాలు చూస్తే మైండ్ బ్లాకే!

విశ్వంభర సినిమాలో ఎనిమిది రకాల టైటిల్ కార్డ్స్‌తో సరికొత్త ప్రయోగం. Photo Credit: Viswambhara Movie Team.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వశిష్ఠ కీలక విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో చిరంజీవికి ఎనిమిది ప్రత్యేక టైటిల్ కార్డులు ఉంటాయని తెలిపారు. ప్రతి టైటిల్ కార్డు కథా ప్రయాణం, భావోద్వేగ స్థాయికి అనుగుణంగా ప్రత్యేకంగా రూపకల్పన చేశామ‌ని చెప్పారు. ప్రధాన వాణిజ్య సినిమాల్లో ఇది అరుదైన ప్రయత్నమని, ఈ అంశం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. సినిమా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవి ఈ సినిమా చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో సర్‌ప్రైజులు ఉన్నాయి. కానీ ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదు.. అంటూ ఉత్కంఠను పెంచారు.

జూలై 10న విడుద‌ల‌..? త‌్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న‌..?

చిత్ర నాణ్యతపై సమయం కేటాయించలేదనే ప్రచారాలను వశిష్ఠ ఖండించారు. ఇది నా జీవితం, నా శ్ర‌మ‌. నాణ్యత కోసం కష్టపడకపోవడం ఎలా సాధ్యం?.. అంటూ స్పష్టంగా స్పందించారు. విజువల్‌గా గొప్ప అనుభూతి అందించడమే లక్ష్యమని తెలిపారు. కాగా విశ్వంభ‌ర చిత్రంలో చిరంజీవితోపాటు త్రిష‌, ఆషికా రంగ‌నాథ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని భావించారు. అయితే భారీ విజువల్ ఎఫెక్ట్స్ మెరుగుదల కోసం వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం జూలై 10న థియేటర్లలోకి రానుంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన చేయ‌నున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా విడుద‌ల కానుంది. అద్భుత‌మైన విజువల్స్, హైఎండ్ VFX, భారీ క్లైమాక్స్ తో విశ్వంభరపై ప్రేక్షకులలో ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తి పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం ఆశించిన అంచ‌నాల‌ను అందుకుంటుందా, చిరంజీవి కెరీర్‌లో మ‌రో మైలురాయిలా నిలుస్తుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఖుష్బూ భర్త సుందర్ సి పేరిట నకిలీ ఖాతాలు.. ఫ్యాన్స్‌కు నటి సీరియస్ వార్నింగ్!

సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికే చాలా మంది సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాల ప్లాట్‌ఫామ్‌ల‌లో అకౌంట్ల‌ను ఓపెన్ చేసి త‌మ అభిమానుల‌తో…

Monday, 30 March 2026, 8:36 PM

తల్లయ్యాక నాలో ‘ఆడపులి’ మేల్కొంది.. మాతృత్వంపై కియారా అద్వానీ ఎమోషనల్ కామెంట్స్!

త‌ల్లిన‌య్యాక త‌న జీవితాన్ని చూసే విధాన‌మే మారిపోయింద‌ని బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ తెలిపింది. హీరోల‌కు దీటుగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో…

Monday, 30 March 2026, 3:30 PM

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM