Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్-5 ఫినాలే దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్, పలువురు సెలబ్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్ కి సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నచ్చిన కంటెస్టెంట్స్‌కు ఓట్లు వేయమని అడుగుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా అందులో సింగర్ శ్రీ రామచంద్ర ఇటీవల ఫినాలేకి చేరుకున్నాడు. ఆయన మినహా మిగతా హౌస్‌లో ఉన్న సిరి, కాజల్, మానస్, షణ్ముఖ్, సన్నీ అందరూ కూడా నామినేషన్స్ లోకి వెళ్లారు.
శ్రీరామచంద్ర ఫైనల్‌కి వెళ్లడంతో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ షణ్ముఖ్‌ని విన్నర్ చేయాలని శ్రీ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. శ్రీరామ చంద్రకి ఓటు వేయొద్దని కోరుతున్నా.. దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిస్తే.. కొంతమందికి ప్రేరణగా ఉంటుంది.. ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి.. బిగ్ బాస్ టైటిల్ కూడా ఇవ్వాలని అనుకుంటే అది తప్పు. శ్రీరామ చంద్ర ఫేక్ పర్సన్.. వ్యక్తిత్వం లేని వ్యక్తి.
ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. అతను చాలా టాలెంటెండ్ అని నా ఫేస్ బుక్‌లో చాలా ఏళ్ల క్రితం పోస్టు పెట్టా. డౌన్ టు ఎర్త్ ఉండి.. షణ్ముఖ్ గేమ్ బాగా ఆడుతున్నాడని అంటున్నారు.. నేను అప్పుడప్పుడు అతని గేమ్ చూస్తున్నా. రెగ్యులర్‌గా ఫాలో కావడం లేదు కానీ.. అప్పుడప్పుడూ చూస్తున్నా. నా ఉద్దేశంలో షణ్ముఖ్‌కి ఓటు వేస్తే మంచి చేసినట్టే అవుతుంది.
షణ్ముఖ్ కి సపోర్ట్ చేయమని నన్ను ఎవరూ అడగలేదు, ఆ నిర్ణయం నా అంతట నేనే తీసుకున్నా.. ఎప్పుడో ఒకసారి రామ్ గోపాల్ వర్మ ఇన్‌ఫ్లూయెన్స్‌కి బలయ్యాను కానీ.. ఆ గుణ పాఠంతోనే ఎప్పుడూ ఎవరి మాటా వినకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. దయచేసి ఎవరు మంచోళ్లో.. ఎవరు చెడ్డోళ్లో మీరే నిర్ణయించుకుని ఓటు వేయండి.. షణ్మఖ్‌ని గెలిపించండి.. అంటూ ఆడియన్స్‌ని కోరింది శ్రీ రెడ్డి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…