Balakrishna : బాలకృష్ణ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌.. పండుగ చేసుకునే విషయం..!

December 8, 2021 11:30 AM

Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా అఖండ. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య నటించిన సినిమాలకు ఇప్పటివరకు సీక్వెల్ రాలేదు. అఖండ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో బోయపాటి శ్రీను ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు.

big surprise to Balakrishna fans akhanda movie may be got a sequel plan

డిసెంబర్ 2న అఖండ సినిమా థియేటర్ లలో విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. సినిమా మొత్తం బాలకృష్ణ అద్భుతమైన నటనతో అలరించారు. అఖండ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. ప్రతి పాత్రకు విభిన్నమైన వేరియేషన్ చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో అఘోరా పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంది.

అఖండ సినిమా క్లైమాక్స్ లో ఈ జన్మకి శివుడే నాకు తండ్రి.. పార్వతీ మాతే నాకు తల్లి అని అంటారు. ఈ క్రమంలో బాలకృష్ణ కూతురుకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను అని మాట ఇస్తాడు. సీక్వెల్ ని తెరకెక్కిస్తే కనుక బాలయ్య తన మాట నిలబెట్టుకోవడానికి అఖండగా మళ్ళీ వస్తాడని టాక్ వినిపిస్తోంది.

అలాగే సీక్వెల్ లో అఘోరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తే.. అఘోరా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అఘోరాగా ఎలా పెరిగాడు.. అఘోరాల వ్యక్తిత్వం, వారి కర్తవ్యం ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తారు. ఆలయాలకు మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే పాత్రలో కనిపించనున్నారు.

ఈ క్రమంలో అతనికి ఏమైనా ప్రాబ్లెమ్స్ వచ్చాయా.. అందుకే చెడ్డ అఘోరాలను చంపాడా.. అనేవి కూడా చూపిస్తారట. అలాగే ఈ సినిమాను ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తారట. దీంతో పొలిటికల్ గా కూడా బాలయ్యకు ప్లస్ అయ్యే ఛాన్సులు ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now