Bala Krishna: నీ సినిమాల త‌ర్వాత హీరోల రెండుమూడు సినిమాలు ఫ‌స‌కేగా.. బాల‌కృష్ణ ఫ‌న్నీ కామెంట్స్

December 17, 2021 11:03 AM

Bala Krishna : అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్న బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1లో భాగంగా 4 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. అలాగే వరసగా ఎపిసోడ్స్ షూట్ చేస్తూనే ఉన్నాడు బాలయ్య. ఇప్పటికీ మహేష్ బాబు ఎపిసోడ్ ఎయిర్ కాలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అయితే తాజాగా ఐదో ఎపిసోడ్‌కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

Bala Krishna said to rajamouli that your heroes movies will flop

ఐదో ఎపిసోడ్‌లో యూనివర్సల్ డైరెక్టర్ రాజమౌళిని రంగంలోకి దింపారు. రాజమౌళితోపాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పిక్స్ రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు ప్రోమోను విడుద‌ల చేశారు. ఇందులో రాజమౌళిని బాలకృష్ణ పలు ప్రశ్నలు అడిగారు. ‘మీరు ఇంటెలిజెంట్‌ అని, అఛీవర్‌ అని తెలుసు. ఇంకా ఎందుకు ఆ గడ్డం’, ‘మీతో సినిమా చేస్తే.. హీరోకు, ఇండస్ట్రీకి హిట్‌ ఇస్తారు.

ఆ తర్వాత ఆ హీరోల రెండు, మూడు సినిమాలు ఫసక్‌యేగా’ అని ప్రశ్నించగా, రాజమౌళి కేవలం హావభావాలు మాత్రమే పలికించారు. ‘సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి’ అని అడగ్గా, ‘మీకూ తెలుసు, నాకూ తెలుసు ఇది ప్రోమోఅని, సమాధానాలు ఎపిసోడ్‌లో చెబుతా’ అని రాజమౌళి చెప్పటం నవ్వులు పూయిస్తోంది. ఇదిలా ఉండగా ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని, సెకండ్ ఎపిస్డోడ్ లో నేచురల్ స్టార్ నానిని, మూడో ఎపిసోడ్ లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడిని, నాలుగవ ఎపిసోడ్ లో అఖండ టీమ్ ను.. ఇంటర్వ్యూ చేశారు బాలయ్య.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now