Bahubali 3 : బాహుబలి 3 పక్కా.. మనసులో మాటను చెప్పేసిన రాజమౌళి..

December 18, 2021 12:30 PM

Bahubali 3 : ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన విష‌యం తెలిసిందే. రెండు పార్ట్‌లుగా విడుద‌లైన ఈ చిత్రం రికార్డుల‌ని చెరిపేసింది. ఈ సినిమాకు మూడో పార్ట్ ఉంటుందా అని కొద్ది రోజులుగా అభిమానుల‌లో అనేక ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రాజ‌మౌళి వివ‌ర‌ణ‌తో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.

Bahubali 3 is sure director ss rajamouli told his inner words

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో రాజమౌళికి అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయని విలేకరులు ఎన్నో సందేహాలను అడుగుతున్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్టు అయితే తప్పకుండా మహేష్ బాబు తోనే ఉంటుందని, అది కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చాలా క్లియర్ గా రాజమౌళి వివరణ ఇస్తూ వస్తున్నారు.

బాహుబ‌లి 3 గురించి అడిగిన ప్ర‌శ్న‌కు ఇప్పుడు కాక‌పోయినా.. భ‌విష్య‌త్తులో బాహుబ‌లి 3 త‌ప్ప‌క ప్లాన్ చేస్తాన‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. అయితే ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యంపై ఇప్పుడే చెప్పలేనని అన్నారు. గ‌తంలో ఈగ సీక్వెల్ కూడా ఉంటుంద‌ని తెలియ‌జేశారు. మొత్తానికి రాజ‌మౌళి నోటి నుండి బాహుబ‌లి 3 రూపొంద‌నుంద‌నే వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో అభిమానుల్లో ఆనందం అవ‌ధులు దాటుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now