Ashu Reddy : రామ్‌ గోపాల్‌ వర్మ అంటే అందుకనే ఇష్టం.. ఎందుకో చెప్పేసిన అషు రెడ్డి..

December 14, 2021 1:47 PM

Ashu Reddy : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్నా, మీడియాలో కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలన్నా కూడా ఆర్జీవీ తరువాతే ఎవ్వరైనా. ఆయ‌న ఆ మ‌ధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో బోల్డ్‌గా ఇంట‌ర్వ్యూలు ఇచ్చి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచారు. శృంగారం గురించి పచ్చి పచ్చిగా మాట్లాడిన ఆయ‌న అరియానా శరీర భాగాలను వింత రీతిలో వర్ణించారు.

Ashu Reddy  told why she likes ram gopal varma very much

అషూ రెడ్డితో కూడా అలాంటి ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేసిన వ‌ర్మ ఆ ఇంట‌ర్వ్యూలో అషూ రెడ్డి తొడల మీద తన ఫోకస్ అంతా పెట్టేశాడు. రకరకాల యాంగిల్స్‌లో అషూ రెడ్డిని ఫోటోలు తీశాడు ఆర్జీవీ. ఆ ఫోటోలు, వర్మ పెట్టిన కెమెరా యాంగిల్స్‌ నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే వ‌ర్మ ఇంత బోల్డ్ నెస్‌గా ఉండ‌డంపై కొంద‌రు ఫైర్ కాగా, అషూలాంటి వారు స‌పోర్ట్ చేశారు. తాజాగా ఆమె వ‌ర్మ అంటే ఎందుకు ఇష్ట‌మో పేర్కొంది.

ఆర్జీవీ అంటే తనకు ఎందుకు ఇష్టమనే విషయాన్నీ కూడా ఓ వీడియో ద్వారా బయటపెట్టేసింది. ఆర్జీవీతో చాలాసార్లు పర్సనల్‌గా చర్చించాను. ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా గొప్పగా వివరిస్తారు. ముఖ్యంగా శృంగార జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఆయన వివరంగా చెప్పారని, అయితే ఈ రోజుల్లో అలా చెప్పడంలో తప్పులేదని తాను భావిస్తున్నట్లు చెబుతూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది.

శృంగార జీవితంలో బ్యూటీ అనేదాన్ని ఎలా ఆస్వాదిస్తారో కూడా చాలా క్రియేటివ్‌గా ఆర్జీవీ వర్ణించారని, శృంగార జీవితం, రెగ్యులర్ లైఫ్.. వాటిని ఎలా ఎంజాయ్ చేస్తారనే దానిపై పూర్తి అర్థవంతంగా అన్నీ తెలియజేశారని అషు రెడ్డి చెప్పడం గమనార్హం. ఆయనలో ఉండే ఓపెన్‌నెస్ తనకు చాలా నచ్చిందని, అందుకే ఆయనంటే చాలా ఇష్టమని అషు పేర్కొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now