Anushka Shetty : నవ్వు వల్ల ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని మనకు వైద్యులు చెబుతుంటారు. అందుకనే రోజూ కాసేపు హాయిగా నవ్వాలని కూడా సూచిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. కొందరు తమకు నవ్వు వస్తే ఆపకుండా అదే పనిగా నవ్వుతుంటారు. ఇదే క్రమంలో వారు కిందపడి దొర్లుతూ కడుపుబ్బా నవ్వుతుంటారు. ఇలా కొందరికి నవ్వు కానీ, ఏడుపు కానీ వస్తే ఒక పట్టాన ఆగవు. కానీ కాసేపటికి అవే ఆగిపోతాయి. అయితే ఇంకా కొందరికి మాత్రం నవ్వు లేదా ఏడుపు ఏది వచ్చినా సరే ఒక పట్టాన ఆగదట. నిరంతరాయంగా 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటారట. అవును కొందరు ఇలాగే చేస్తారు.
అయితే ఇలా నిరంతరాయంగా ఆపకుండా ఏడ్చిన, నవ్వినా దాన్ని జబ్బే అని అంటున్నారు వైద్యులు. నిజంగా ఈ జబ్బుతోనే నటి అనుష్క శెట్టి కూడా బాధపడుతోందట. దీని వల్ల ఆమె సినిమా షూటింగ్‌లలో చాలా సార్లు షూటింగ్‌ను కాసేపు ఆపేయాల్సి వచ్చిందట కూడా. కామెడీ సీన్లు చేస్తే బాగా నవ్వేదట. ఎమోషనల్ సీన్లు చేస్తే బాగా ఏడ్చేదట. అలా ఆపకుండా 15 నుంచి 20 నిమిషాలు చేసేదట. దీంతో చాలా సేపు సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడేదట. ఈవిషయాన్ని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా వెల్లడించింది.
అయితే దీన్ని వైద్య పరిభాషలో pseudobulbar affect (PBA) అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బుతో అమెరికాలో సుమారుగా 20 నుంచి 70 లక్షల మంది బాధపడుతున్నారని క్లీవ్‌లాండ్ క్లినిక్ తెలియజేసింది. అయితే ఈ జబ్బు వచ్చేందుకు ప్రత్యేక కారణాలు ఏమీ ఉండవని, పలు నాడీ సంబంధ సమస్యలు లేదా తలకు గాయం అవడం వంటి కారణాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మానసిక వైద్యుల పర్యవేక్షణలో దీన్ని నయం చేసే చాన్స్ ఉంటుందని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…