Allu Arjun : సుకుమార్‌ని ఇమిటేట్ చేస్తూ ఫ‌న్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్..!

December 20, 2021 6:33 PM

Allu Arjun : డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప చిత్రం ఇప్ప‌టికీ వైబ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. భారీగా క‌లెక్ష‌న్స్ ను రాబ‌డుతూ ఈ సినిమా చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నటన, యాక్షన్‌ సన్నివేశాలకు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి కొనసాగింపుగా ‘పార్ట్‌-2’ కూడా విడుదలవుతుందని బృందం ఇప్పటికే ప్రకటించింది. తొలి పార్ట్‌లో చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వ‌దిలేశారు. దీంతో అవి సెకండ్ పార్ట్‌లో దొర‌కుతాయని భావిస్తున్నారు.

Allu Arjun imitates sukumar very funny action

అయితే పుష్ప‌కు సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, ప‌లు ఆస‌క్తికర అంశాలు బ‌యట‌కు వ‌స్తున్నాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అల్లు అర్జున్.. సుకుమార్‌ని అద్భుతంగా ఇమిటేట్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆయ‌న టేక్ ఓకే చేసే స‌మ‌యంలో ఎలా ఉంటాడ‌నేది ఫ‌న్నీగా చేసి చూపించారు బ‌న్నీ. ఈ క్ర‌మంలో న‌వ్వులు విర‌బూశాయి.

పుష్ప తొలి భాగంలో ఒక సాధారణ కూలీగా జీవితం మొదలు పెట్టిన పుష్పరాజ్‌ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది అదిరిపోయేలా చూపించారు దర్శకుడు సుకుమార్‌. పార్ట్‌-1లో మంగళం శ్రీనుగా ప్రతినాయకుడిగా పాత్రలో సునీల్‌ సరికొత్తగా కనిపించారు. రెండో భాగంలో ఈ పాత్రను మరింత క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్పరాజ్‌ను ఎదుర్కొనే దీటైన పాత్రగా మరోసారి సునీల్‌కు ఎలివేషన్‌ లభించే అవకాశం ఉందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now