Alia Bhatt : ఫ‌స్ట్ టైమ్ తెలుగులో మాట్లాడి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన ఆలియా భ‌ట్..!

December 11, 2021 1:59 PM

Alia Bhatt : పాన్ ఇండియా సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫిల్మ్ టీమ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో ఆలియా భట్ తెలుగులో మాట్లాడి అందరినీ ఎంటర్ టైన్ చేసింది.

Alia Bhatt surprised everybody in talking telugu

ఆలియా భట్ ఫస్ట్ టైమ్ లో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో తన పేరు తెలుగులోనూ మార్మోగిపోవాలని గట్టి నిర్ణయంతో ఉంది. అల్లూరి సీతారామరాజుకు భార్యగా సీత పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ పాత్రపై తెలుగు ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆలియా భట్ తెలుగులో మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, బాగున్నారా.. బాగున్నాను.. అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పగిలిపోయింది. ముంబైలో అయితే మాకు పిచ్చెక్కిపోయింది.. అంటూ ఊర మాస్ లెవెల్ లో మాట్లాడింది. దీంతో ఆడిటోరియం మొత్తం మార్మోగిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో తానే తెలుగు డబ్బింగ్ చెప్పడం హైలెట్ గా నిలిచింది.

ఈ సినిమాను ఆలియా ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ వర్క్ చేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. మీడియా అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ.. తాను కూడా లాక్ డౌన్ లో చాలా ఇబ్బందిలకు గురయ్యానని.. రాజమౌళితో వర్క్ చేయడం చాలా స్పెషల్ గా అనిపించింది అని, రామ్ చరణ్ తో వర్క్ కూడా తనకు ఆనందాన్ని అందించిందని తెలిపింది. ఇక ఈ సినిమాతో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఆలియా భట్ తెలియజేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now