Akhanda Movie : రికార్డుల వేటలో బాలయ్య అఖండ మూవీ.. మ‌రో రికార్డు ఖాతాలో..!

December 10, 2021 10:35 PM

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ తాజాగా న‌టించిన అఖండ మూవీ రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మ‌రో రికార్డును సొంతం చేసుకుంది. డిసెంబ‌ర్ 2వ తేదీన విడుద‌లైన ఈ మూవీ ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక గ్రాస్ క‌లెక్ష‌న్ల‌న సాధించిన మూవీగా రికార్డుల‌కెక్కింది.

Akhanda Movie continuing records in overseas also

బాల‌కృష్ణ అఖండ మూవీ మాస్ జాతర ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ కొన‌సాగుతోంది. విదేశాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ ఏకంగా రూ.10.08 కోట్ల గ్రాస్ ను మొద‌టి వారంలో సాధించింది. ఈ క్ర‌మంలోనే విదేశాల్లో ఈ ఏడాది అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డుల‌కెక్కింది. ఈ సంద‌ర్బంగా విదేశాలకు చెందిన డిస్ట్రిబ్యూట‌ర్ రాధాకృష్ణ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇక అఖండ మూవీ అమెరికాలో రూ.6.68 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.1.26 కోట్లు, యూకేలో రూ.72 ల‌క్ష‌లు, యూర‌ప్‌లో రూ.15 ల‌క్ష‌లు, గ‌ల్ఫ్ దేశాల్లో రూ.80 ల‌క్ష‌లు, కెన‌డాలో రూ.25 ల‌క్ష‌లు, సింగ‌పూర్‌లో రూ.13 ల‌క్ష‌లు, మ‌లేసియాలో రూ.4 ల‌క్ష‌లు, సౌతాఫ్రికా, జాంబియా, టాంజానియా, జ‌పాన్‌ల‌లో రూ.5 ల‌క్ష‌ల గ్రాస్ వసూళ్ల‌ను మొద‌టి వారంలో రాబ‌ట్టింది. ఈ మూవీకి బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now