Akhanda Movie : అఖండ సినిమా చూసి.. స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన బ్రాహ్మిణి..!

December 8, 2021 7:20 AM

Akhanda Movie : డిసెంబ‌ర్ 2న విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం అఖండ‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్యకు మరోసారి మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. బాల‌య్య గత కొంత కాలంగా సక్సెస్ కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ దర్శకత్వంలో చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నందమూరి బాలకృష్ణ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Akhanda Movie balakrishna daughter nara brahmani comments

అఖండ విజ‌యం త‌ర్వాత ఫ్యాన్స్‌తోపాటు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఉత్సాహం వ‌చ్చింది. అఘోరగా బాలకృష్ణ తన విశ్వరూపం చూపించారని అంటున్నారు. ‘అఖండ’ను చూసిన వాళ్లంతా ఈ సినిమా టీమ్ ని ఎంతగానో అభినందిస్తున్నారు. బాలకృష్ణ నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి కూడా తన స్పందనను తెలియజేశారు.

‘అఖండ’ సినిమా అద్భుతంగా ఉంది. అప్పుడు తాతగారు .. ఇప్పుడు నాన్నగారు సినిమా పరిశ్రమ స్టాండర్డ్స్ ను పెంచడంలో కీలకమైన పాత్రను పోషించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంది. నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కూడా డెఫినెట్ గా ఈ సినిమాను చూడాలి. ఈ సందర్భంగా మా మదర్ ను .. ఫాదర్ ను కంగ్రాట్యులేట్ చేయాలనుకుంటున్నాను అని తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now