అలర్ట్: ఏపీలోని గురుకులాలలో ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు.. వెంటనే అప్లై చేయండి!

August 16, 2021 1:55 PM

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ (APSWREIS) లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు, ప్రిన్సిపాల్, కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులను కోరుతూ గత నెల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తుల స్వీకరణకు నేడు ఆఖరి రోజు.ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఆసక్తి అర్హత కలిగి ఉంటారో అలాంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి 46 పోస్టులలో గ్రేడ్ టు విభాగంలోని ప్రిన్సిపల్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉండగా, TGT విభాగంలో 38, కేర్ టేకర్ విభాగంలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేసింది. ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు చేయాలి అనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనీసం 60 శాతం, బిఈడి 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే టిజిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ పూర్తిచేసి ఉండి టెట్ క్వాలిఫై అయిన వారు అర్హులు.అదేవిధంగా కేర్ టేకర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి నేడే ఈ ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి తేదీ. మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ క్రింది అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.
https:welfarerecruitments.apcfss.in/

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “అలర్ట్: ఏపీలోని గురుకులాలలో ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు.. వెంటనే అప్లై చేయండి!”

Leave a Comment