ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూడా కచ్చితంగా రోజూ తుడుచుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి బయట చెత్తాచెదారం లేకుండా తుడుచుకుని నీళ్లు జల్లి, ముగ్గు పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది రకరకాల ముగ్గులను వేస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. అయితే, అసలు ముగ్గులు ఎందుకు వేయాలి..? ముగ్గుల అర్థం, పరమార్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి గడప ముందు ముగ్గులలో భాగంగా 2 గీతల్ని గీస్తూ ఉంటారు. అయితే, ఇలా గీయడం వలన దుష్టశక్తులు రావట. పైగా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ముగ్గు వేసి నాలుగు వైపులా కూడా రెండేసి అడ్డగీతలు గీస్తూ ఉంటారు. అలా చేయడం వలన శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయట. పండుగల సమయంలో కచ్చితంగా ఇలా ముగ్గు వేసి, అడ్డగీతలు గీయాలి. ఏ పూజ చేసుకున్నా కూడా ముందు పీట మీద దేవతని పెట్టేటప్పుడు, ముగ్గు వేయాలి.
నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీసుకోవాలి. నక్షత్ర ఆకారంలో వచ్చే గీతాలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలని తొలగిస్తుంది. ఇవేమి మీ దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది. మనం పద్మాన్ని, చుక్కల ముగ్గులు కూడా వేస్తూ ఉంటాము. వాటిలో అనేక కోణాలు ఉంటాయి. అవి గీతలే కాదు. యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర, శాస్త్ర రహస్యలతో కూడి ఉండడం వలన మనకి ఎటువంటి చెడు శక్తులు కలగకుండా, మనకి ఎలాంటి హాని కూడా కలగకుండా అవి చూస్తాయి.
అందుకనే అసలు ముగ్గు ని తొక్కకూడదని చెప్తూ ఉంటారు. తులసి మొక్క దగ్గర అయితే, అష్టదళ పద్మం వేసి, దీపారాధన చేస్తే మంచిది. నూతన వధూవరులు మొదటిసారి భోజనం చేసేటప్పుడు, చుట్టుపక్కల లతలు, పుష్పాలు, తీగలతో ఉన్న ముగ్గులను వేయాలి. ఓం, స్వస్తిక్, శ్రీ వంటి కలిగిన ముగ్గులు వెయ్యద్దు. ఎందుకంటే వాటిని అస్సలు తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలో అమ్మవారు, శ్రీమహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆమెకి ఏడు జన్మల వరకు వైధవ్యం ఉండదు. సుమంగళిగానే చనిపోతుంది అని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…