Sravanam : తెలుగు నెలలు చైత్రంతో మొదలు అవుతాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదవ నెల. ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం ఈ నెలలో పాలిస్తుంది. అందుకే దీన్ని శ్రావణ మాసం అని అంటారు. ఈ తెలుగు నెలలో ఈశ్వరుడిని, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ నెలలోనే వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వస్తాయి. నాగ పంచమి, రాఖీ పౌర్ణమి వంటివి కూడా వస్తాయి.
కానీ ఈసారి రెండు శ్రావణ మాసాలు వచ్చాయి. ప్రతి ఏడాది కూడా ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం 12 నెలలు. తెలుగు పంచాంగం ప్రకారం కూడా 12 నెలలే వస్తూ ఉంటాయి. అయితే 2023లో అధిక శ్రావణ మాసంతో 13 నెలలు వచ్చాయి. ప్రతి మూడేళ్లకు ఒక మాసం ఎక్కువగా వచ్చి 13 నెలలు వస్తుంటాయి. ఎందుకు రెండు శ్రావణ మాసాలు వచ్చాయి..? ఈ శ్రావణ మాసంని ఏం అంటారు..? అసలు ఈ శ్రావణ మాసంలో ఏం చెయ్యాలి వంటివి ఇప్పుడు చూద్దాం.
అధిక శ్రావణ మాసం 19 ఏళ్లకు ఓ సారి వస్తుంది. ఇలా వచ్చే దానినే అధిక శ్రావణం అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం చూస్తే జూలై 18 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా అధిక శ్రావణ మాసం ఉంది. ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిజ శ్రావణం. దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటైన ఈ శ్రావణ మాసంలో శివుడిని ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది.
ఈ అధిక మాసంలో పెళ్లిళ్లు చేసుకోకూడదు. అలానే కొత్త షాపులని మొదలు పెట్టడం వంటివి అధిక మాసంలో చెయ్యకూడదు. కొత్త ఇంటి కోసం భూమి పూజలు చేయడం వంటివి చేయకూడదు. అదే విధంగా ఉపనయనము, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు కూడా చేసుకోకూడదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…