చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయడం అనేది హిందూ సాంప్రదాయంలో ఉంది. హిందువులందరూ ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే చిన్నారులకు పుట్టు వెంట్రుకలను ఎందుకు తీస్తారు ? ఎప్పుడు తీస్తారు ? దాని వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మం ప్రకారం చిన్నారులకు పుట్టు వెంట్రుకలను తీయడాన్ని చూడాకరణము అని అంటారు. హిందూ ధర్మంలో పదహారు రకాల సంస్కారాలు ఉంటాయి. వాటిలో చూడాకరణము కూడా ఒకటి. చూడ అంటే శిఖ (పిలక) అని అర్థం వస్తుంది. ఆ శిఖను ఉంచుకొని మిగిలిన వెంట్రుకలను తీసి వేయడాన్ని “చూడాకరణం” అని అంటారు. ఈ సంస్కారం వల్ల పిల్లలకు బలం, ఆయుష్షు, వర్చస్సు కలుగుతాయని చెబుతారు.
పిల్లలకు మొదటి సంవత్సరంలో కానీ, మూడవ సంవత్సరంలో కానీ ఈ సంస్కారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వరకు ఏడాదికి ఒకసారి వెంట్రుకలను తీయాలని కూడా కొందరు పండితులు చెబుతారు. అయితే పుట్టు వెంట్రుకలను దాదాపుగా చాలా మంది పూర్తిగా తీసేస్తారు. కానీ ధర్మం ప్రకారం పిలకలా ఉంచి మిగిలిన వెంట్రుకలను తీయాలి. ఇది తెలియకపోవడం వల్ల చాలా మంది మొత్తం వెంట్రుకలను తీస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…