Mukku Pudaka : ఆడ‌పిల్ల‌ల‌కు ముక్కు పుడ‌క ఎందుకు కుట్టిస్తారు..? దీని వెనుక కార‌ణాలేంటి..?

July 11, 2023 10:35 AM

Mukku Pudaka : అనాదిగా ఆడపిల్లలు ముక్కు పుడకని ధరించడం, ఆనవాయితీగా వస్తోంది. చాలామంది ఆడవాళ్లు ముక్కు పుడకని పెట్టుకుంటారు. పైగా పెద్దలు కచ్చితంగా ఆడపిల్లకి ముక్కుపుడక ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆడపిల్లలకి ముక్కుపుడక ఉండాలి..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, ముక్కుపుడక వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు.

పైగా వివాహ సమయానికి అమ్మాయిలకి కచ్చితంగా ముక్కుపుడక ఉండాలి. అమ్మాయికి 7 ఏళ్ళు, 11 ఏళ్ళు వచ్చేసరికి ముక్కుపుడకని పెడతారు. ముక్కుని కుట్టిస్తారు. చిన్న వయసులో కుట్టిస్తే ఆరోగ్య ప్రయోజనాలని పొందొచ్చు. ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకి మండలాకారమైన ఒక రాయి ఉంటే, మంచిదని శాస్త్రాలు కూడా అంటున్నాయి. ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. కాబట్టి అర్థ చంద్రాకారంలో ముక్కుపుడక ధరిస్తే మంచిది.

Mukku Pudaka importance what are the reasons
Mukku Pudaka

ఎడమవైపు ముక్కుపుడక పెట్టుకుంటే ఆడవారికి గర్భకోశ వ్యాధులు తగ్గుతాయి. పైగా సుఖ ప్రసవం అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా కన్ను, చెవికి సంబంధించిన నరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. చెవికి సంబంధించిన వ్యాధులు కూడా రావు. ముక్కుపుడకని ధరించడం వలన శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. మరో పక్క ముక్కుపుడక వలన ఆడవాళ్లు మరింత అందంగా కనపడతారు. కేవలం ఆడవాళ్లే కాదు దేవతలు కూడా అలంకారానికి ముక్కుపుడకని పెట్టుకునేవారు.

తాళిబొట్టు లాగే ముక్కుపుడకని కూడా జీవితాంతం చాలామంది తొలగించరు. భర్త క్షేమంగా ఉండాలని చాలా మంది ముక్కుపుడకని పెట్టుకుంటారు. సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారి కోసం వెళ్ళమని అంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా కూడా వెళ్ళను అని చెప్తుంది. సత్యభామ విసిగిపోయి ఏం కావాలి అని అడిగితే.. ముక్కెర కావాలని చెప్తుంది. ఆ ముక్కెర తీసుకుని ఆమె లంకె బిందెలు దొరికినంత సంతోషంతో, కృష్ణుడి దగ్గరికి వెళ్లి రాయబారం నడుపుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment