ఆధ్యాత్మికం

Kiradu Temple : ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

Kiradu Temple : అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత. దీంట్లో మనకు తెలియని, తెలిసిన వింతలు, విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి. కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి. అలాగే కొనసాగుతాయి. ఎన్నేళ్లయినా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు. కాగా రాజస్థాన్‌లోని ఓ దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇందులో వింత, రహస్యం ఏముంది అంటారా..? అక్కడికే వస్తున్నాం.

ముట్టుకోగానే రాయిలా మారిపోయేలా చూపించే సినిమాలను మనం గతంలో చూశాం కదా. ఆ..! అవును..! ఈ దేవాలయం కూడా అలాంటిదే. కాకపోతే ఇందులో సూర్యాస్తమయం తరువాత ఉండకూడద‌ట‌. ఉంటే ఇక అంతే సంగతుల‌ట‌..! వారు తెల్లారేసరికి రాయిలా మారిపోతారట. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని బద్మెర్ జిల్లాలో కిరడు అనే పేరిట ఓ దేవాలయం ఉంది. ఇందులో దాగి ఉన్న రహస్యం పట్ల ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. సూర్యాస్తమయం దాటిన తరువాత ఈ దేవాలయంలో ఎవరైనా ఉంటే వారు తెల్లవారేసరికి రాళ్లలా మారిపోతారట.

Kiradu Temple

కొన్ని వేల ఏళ్ల కిందట ఓ రుషి తన విద్యార్థులతో కలిసి ఈ కిరడు దేవాలయానికి వచ్చాడట. అయితే ఆ రుషి తన విద్యార్థులను దేవాలయం సమీపంలో వదలి స్థానికంగా ఉన్న ఓ ప్రాంతాన్ని చూసేందుకు బయటికి వెళ్లాడట. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరూ ఆ విద్యార్థులకు సహాయం చేయలేదట. కొన్ని రోజుల తరువాత ఆ రుషి తిరిగి వచ్చాడు. కాగా అప్పటికే ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో వారిని చూసిన ఆ రుషి జరిగిన విషయం తెలుసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రుషి రాయి లాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడు.

కాగా ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క మహిళ ఆ విద్యార్థులకు సహాయం చేసింది. ఆ రుషి ఈ విషయం కూడా తెలుసుకున్నాడు. దీంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడు. అయితే ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా పోవాలని ఆదేశించాడు. కానీ ఆ మహిళ వెళ్లే క్రమంలో వెనక్కి తిరిగి చూసింది. దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది. అయితే అలా రాయిగా మారిన మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ గ్రామంలో అలాగే ఉందట. ఆ విగ్రహం దేవాలయానికి కొంత సమీపంలో ఉంటుంది. కాలానుగుణంగా ఆ శాపం కాస్తా దేవాలయానికే పరిమితమైందని చెబుతారు. అందుకే ఆ దేవాలయంలో సూర్యాస్తమయం తరువాత ఉన్న వారు రాళ్లుగా మారుతారట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM