శ్రావణమాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఒక ఆలయంగా మారుతుంది. ప్రతి ఇంటిలోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. వివిధ రకాల నోములు, వ్రతాలతో మహిళలు ఎంతో బిజీగా ఉంటారు. అదే విధంగా ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ కూడా వస్తుంది. ఈ రాఖీ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. మరి రాఖీ కట్టేటప్పుడు ఏ సమయంలో కట్టాలి, రాఖీ కట్టే సమయంలో ఏ వస్తువులు తప్పకుండా ఉండాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా.
అన్నాచెల్లెళ్ల బంధానికి ఎంతో ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రోజు సోదరి తన సోదరుడికి ఎప్పుడూ కూడా యమగండం, రాహుకాలంలో రాఖీ కట్టకూడదు. శుభ ముహూర్తంలోనే రాఖీ కట్టాలి. అదేవిధంగా రాఖీ కట్టడం కోసం మనం కొన్ని రకాల వస్తువులను సిద్ధం చేసుకుంటాం. ముఖ్యంగా రాఖీ కట్టే సమయంలో ఎలాంటి వస్తువులు ఉండాలి అనే విషయానికి వస్తే..
సోదరుడికి రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా కుంకుమ ఉండాలి. కుంకుమ దీర్ఘాయుష్షుకు అదృష్టానికి ప్రతీక. అదేవిధంగా అక్షింతలు. అక్షతం అంటే పరాజయం లేనిది అని అర్థం. అందుకోసమే అక్షింతలు సోదరుడిపై వేయడం వల్ల అతని జీవితంలో ఎలాంటి పరాజయం లేకుండా విజయాలతో దూసుకుపోతాడని అర్థం. కొబ్బరికాయను శ్రీ ఫలం అని కూడా పిలుస్తాం. రాఖీ కట్టే సమయంలో సోదరుడికి కొబ్బరికాయ ఇస్తారు. ఇది అతడి అభివృద్ధికి సూచిక. అదేవిధంగా మిఠాయిలు కూడా తప్పనిసరిగా ఉండాలి. రాఖీ కట్టే సమయంలో సోదరి తన సోదరుడికి మిఠాయి తినిపించడం వల్ల వారిద్దరి మధ్య సంబంధం ఎలాంటి కలహాలు లేకుండా తియ్యగా ఉంటుందని చెబుతారు. కనుక రాఖీ కట్టే సమయంలో తప్పనిసరిగా ఈ వస్తువులు ఉండాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…